కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త.. అలా రిటైర్ అయ్యేవారికి కూడా హైక్ వర్తింపు..!

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త.. అలా రిటైర్ అయ్యేవారికి కూడా హైక్ వర్తింపు..!

చాలా కాలం నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతన పెంపుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మరోపక్క పెన్షనర్లలో మరో రకమైన ఆందోళనలు కొనసాగుతున్నాయి. వేతన పెంపులకు ముందు రిటైర్ అయితే ఇన్నాళ్లు పనిచేసిన కాలానికి తమకు వర్తించే లేదా వచ్చే వేతన పెంపును మిస్ అవుతామని, అది వారికి వచ్చే పెన్షన్ మెుత్తంపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలో ఉన్నారు. అయితే ఇప్పుడు దీనిపై ఒక శుభవార్త వచ్చింది.

తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కీలక ప్రకటన చేసింది. దీని ప్రకారం వార్షిక వేతన పెంపు తేదీ జూన్ 30 లేదా డిసెంబర్ 31కి ఒక్కరోజు ముందు ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందుతున్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సైతం ప్రస్తుతం నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుందని స్పష్టం చేసింది. వాస్తవానికి కేంద్ర సివిల్ సర్వీసెస్ రూల్స్ 2006 ప్రకారం జూలై 1న వార్షిక వేతన పెంపు ఉంటుంది. అయితే తర్వాత 2016లో వేతన పెంపులకు రెండు తేదీలను అనుమతిస్తూ జనవరి 1, జూలై 1ని ప్రతిపాదించటం జరిగింది.

ALSO READ | వక్ఫ్ ఒక ట్రస్ట్.. ముస్లిం మతంలో భాగం కాదు : సుప్రీంలో కేంద్రం

అందువల్ల జూన్ 30న లేదా డిసెంబర్ 31న రిటైర్మెంట్ పొందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం వేతన పెంపుల ప్రయోజనం నుంచి మినహాయింపబడరని వెల్లడైంది. మద్రాస్ హైకోర్టు 2017లో ఒక కేసులో ఇచ్చిన తీర్పు తర్వాత ఈ అంశం ప్రాచుర్యం పొందింది. తొలినాళ్లలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కేవలం కోర్టు ఉత్తర్వుల పొందిన కేసుల్లో మాత్రమే నోషనల్ పెంపును అందించేది. ఆ తర్వాత ఇలాంటి కేసులు అనేక కోర్టుల్లో ఫైల్ కావటంతో ఇలాంటి కేసులన్నింటికీ కొన్ని షరతుల మేరకు వారు పనిచేసిన పూర్తి సంవత్సరం మంచి పనితీరు కలిగి ఉన్న రిటైర్డ్ ఉద్యోగులందరికీ వర్తింపజేశారు.

అయితే ప్రస్తుతం మే 20, 2025న అధికారికంగా విడుదల చేసిన మెమెురాండం ప్రకారం అర్హులైన అందరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నోషనల్ హైక్ వర్తింపజేశారు. న్యాయ నిపుణుల నుంచి పొందిన సలహా మేరకు వేతన పెంపుకు ఒక్క రోజు ముందు రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులకు సైతం నోషనల్ హైక్ అందించటం జరుగుతుందని స్పష్టం చేసింది. ఇది రిటైర్ అయ్యిన వ్యక్తులు పొందే పెన్షన్ మెుత్తంపై ప్రభావం చూపటం వల్లనే అందరి దృష్టిని ఆకర్షించింది.