మా కాలనీకి రోడ్డు వెయ్యరా.. ? అంటూ ఆగ్రహం.. పాడైన రోడ్డును జేసీబీతో తవ్వేసిన జనం..!

మా కాలనీకి రోడ్డు వెయ్యరా.. ? అంటూ ఆగ్రహం.. పాడైన రోడ్డును జేసీబీతో తవ్వేసిన జనం..!

మన దేశంలో రోడ్ల సమస్య చాలా కామన్ అని చెప్పాలి. పెద్ద పెద్ద సిటీల్లో కూడా రోడ్లపై గుంతలతో జనం తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. ఇక పట్టణాలు, గ్రామాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాడైన రోడ్లకు కొన్ని సంవత్సరాలు గడిచినా మోక్షం కలగదు. వికారాబాద్ జిల్లాలోని తాండూరులోని ఓ కాలనీలో కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. అయితే... పాడైన రోడ్డును బాగు చేస్తారని కొన్నేళ్లుగా ఎదురు చూశారు కాలనీ వాసులు. ఎన్నాళ్ళు ఎదురు చూసినా లాభం లేకపోవడంతో విసిగిపోయారు కాలనీవాసులు. దీంతో కాలనీవాసులు తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కి గురి చేసింది. ఆ నిర్ణయమేంటో ఇప్పుడు చూద్దాం..

వికారాబాద్ జిల్లాలోని తాండూరులో 7వ నంబర్ వార్డులో రోడ్డు పాడవ్వడంతో కొన్ని సంవత్సరాలుగా జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుకు మరమ్మత్తులు చేస్తారని కొన్నేళ్లుగా ఎదురు చూసి విసిగిపోయిన ప్రజలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మా కాలనీకి రోడ్డు వెయ్యరా.. అంటూ కన్నెర్ర చేసిన ప్రజలు పాడైన రోడ్డును జేసీబీతో తవ్వేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ క్రమంలో 7వ నంబర్ వార్డులోని రాయల్ కాంటా దగ్గర ధర్నా చేపట్టారు కాలనీ వాసులు.

రాయల్ కాంటా నుంచి మసీదు వెళ్లే మార్గంలో రోడ్డు చాలా ఏళ్లుగా అద్వాన్నంగా ఉందని తయారైందని.. రోడ్డు వేయకుండా పాలకులు అధికారులు నిర్లక్ష్యం వశిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. ఏదేమైనా.. పాలకులు, అధికారుల నిర్లక్ష్యంగా కారణంగా రోజూ ఇబ్బంది పడుతూ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కాలం గడపకుండా.. తాండూరు ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయం కొత్త ట్రెండ్ కి నాంది పలుకుతుందేమో చూడాలి.