
వక్ఫ్ సరికొత్త చట్టంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి.. ప్రభుత్వం తన వాదనలను వినిపించింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్ లో కీలక అంశాలను స్పష్టం చేసింది.
వక్ఫ్ బోర్డు అనేది ఓ ట్రస్ట్.. ఛారిటీ సంస్థ అని వివరించింది. అలాంటి ఛారిటీ సంస్థకు.. ముస్లిం మతంలో సంబంధం లేదని తన వాదనలను వినిపించింది. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు పరిష్కరించలేని సమస్యలను వక్ఫ్ చట్ట సవరణలతో పరిష్కారం లభించిందని.. వక్ఫ్ బోర్డును ముస్లిం మతంలో ముడిపెట్టటం సరికాదని స్పష్టం చేసింది కేంద్రం.
ALSO READ | ఇది మామూలు విధ్వంసం కాదు.. ఒకేసారి 50 బుల్డోజర్లతో.. ఒక్కరోజులోనే 8500 ఇండ్లు నేలమట్టం
వక్ఫ్ బోర్డు అనేది ఇస్లామిక్ భావనగా ఉందని.. ఇది ఇస్లాం మతంలో భాగం కాదని.. వక్ఫ్ బోర్డు అనేది ముస్లిం మతంలోని ఓ ఛారిటీ సంస్థ తప్ప.. మరొకటి కాదని తన వాదన వినిపించింది కేంద్రం. ప్రతి మతంలోనూ ధానధర్మాలు ఉన్నాయని.. ఒక్కో మతానికి ఒక్కో విధానం ఉందన్న కేంద్రం.. ప్రభుత్వ భూములపై ఎవరికీ హక్కు లేదని.. ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వం కాపాడుకోగలదని సుప్రీంకోర్టులో స్పష్టం చేసింది కేంద్రం.
కొంత మంది ముస్లిం ప్రతినిధులుగా చెప్పుకుంటూ.. వక్ఫ్ బోర్డును.. వక్ఫ్ ఆస్తులను ముస్లిం మతంతో ముడిపెట్టి స్వప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తున్నారంటూ కేంద్రం తరపున సీనియర్ లాయర్ మెహతా తన వాదనలు వినిపించారు. మొత్తం 96 లక్షల పిటీషన్లను పరిశీలించి.. 36 జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశాలు నిర్వహించిన తర్వాతనే వక్ఫ్ చట్ట సవరణ చేశామని.. 1923 నుంచి కొనసాగుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించినట్లు కేంద్రం తన వాదనలో స్పష్టం చేసింది.