Mahesh Babu: మీరుంటే చాలా గర్వపడేవారు నాన్నా.. SSMB29 ఈవెంట్కి ముందు మహేష్ ఎమోషనల్ ట్వీట్

Mahesh Babu: మీరుంటే చాలా గర్వపడేవారు నాన్నా.. SSMB29 ఈవెంట్కి ముందు మహేష్ ఎమోషనల్ ట్వీట్

తెలుగు సినీ చరిత్రలో చెరగని సంతకం చేసిన సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మూడో వర్ధంతి ఇవాళ. 2022లో గుండెపోటుతో కన్నుమూశారు కృష్ణ. శనివారం (2025 నవంబర్ 15న) మూడో వర్ధంతి. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ వారసుడు, హీరో మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు.

‘‘నాన్నా.. ఈరోజు మీ గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నాను. మీరుంటే చాలా గర్వపడేవారు’’ అంటూ చిన్ననాటి ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఇక్కడ మహేష్ పదాలను గమనిస్తే.. ఎంతటి భావోద్వేగంతో ఈ ట్వీట్ చేసి ఉంటాడో అర్ధమవుతుంది. ఈ క్రమంలో ఇవాళ జరగనున్న SSMB29 ఈవెంట్‌లో.. మహేష్ ఇచ్చే స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ కృష్ణ.. సాహసమే మార్గంగా, ధైర్యమే సిద్ధాంతంగా, కొత్తదనమే నమ్మే సూత్రంగా జీవించారు. ప్రయోగాలు ఆయన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మైలు రాళ్లు.. అలా సాహసాలను ఇంటిపేరుగా మార్చుకుని, ఇండస్ట్రీని ప్రయోగశాలగా కొన్నేళ్ల పాటు తెలుగు తెరను ఏలిన రారాజు సూపర్ స్టార్ కృష్ణ. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాత తన ప్రతిభను చాటుకున్నారు కృష్ణ.

దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన సూపర్ స్టార్ కృష్ణ సినీ చరిత్రలో ఎప్పటికీ నిలుచుండిపోతారు. నటుడిగానే కాక మంచి వ్యక్తిగానూ అందరి మనసుల్లో నిలిచిన నటశేఖరుడి మూడో వర్ధంతి అవ్వడంతో.. ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియాలో ఎమోషనల్ ట్వీట్స్ చేస్తున్నారు.

SSMB 29 ఈవెంట్ :

మహేష్ బాబు-రాజమౌళి భారీ అడ్వెంచరస్‌‌ మూవీ SSMB 29 (వర్కింగ్ టైటిల్). ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీలో మహేశ్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (మందాకినిగా) నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభగా) విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో నిర్వహించే మెగా ఈవెంట్‌లో కాసేపట్లో షురూ కానుంది. ఈ వేదికపైనే సినిమా టైటిల్‌తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్‌ను కూడా రివీల్ చేయనున్నారు.