IPL 2025: సెంచరీ తర్వాత 500 కంటే ఎక్కువ మిస్డ్ కాల్స్ వచ్చాయి.. నాకు ఎవరూ అవసరం లేదు: సూర్యవంశీ

IPL 2025: సెంచరీ తర్వాత 500 కంటే ఎక్కువ మిస్డ్ కాల్స్ వచ్చాయి.. నాకు ఎవరూ అవసరం లేదు: సూర్యవంశీ

ఐపీఎల్ 2025 లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ళ వయసులోనే ఈ మెగా టోర్నీలో ఆడిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించాడు. లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేసిన వైభవ్ ఐపీఎల్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ కొట్టి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు. సన్ రైజర్స్ తో జరిగిన రెండో మ్యాచ్ లో భువనేశ్వర్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టి ఫ్యూచర్ స్టార్ అంటూ కితాబులందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ పై  35 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకొని ఐపీఎల్ లో సంచలనంగా మారాడు. సూర్యవంశీ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లతో పాటు ఏకంగా 11 సిక్సర్లున్నాయి. 

ALSO READ | MI vs DC: ప్లే ఆఫ్స్ ముందు మరో ట్విస్ట్.. ముంబై, ఢిల్లీ మ్యాచ్‌కు వర్షం ముప్పు

తన సెంచరీ గాలివాటం కాదని నిరూపిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ పై మంగళవారం (మే 20) 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సత్తా చాటాడు. ఓవరాల్ గా ఈ ఐప్లె లో వైభవ్ ఇప్పటివరకు 7 మ్యాచ్ ల్లో 200 పైగా స్ట్రైక్ రేట్ తో 252 పరుగులు చేసి రాజస్థాన్ జట్టుకు ఆశాకిరణంలా మారాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ ద్రవిడ్.. సూర్యవంశీతో నువ్వు సెంచరీ చేసిన తర్వాత నీళ్లు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి అని అడిగాడు. దానికి వైభవ్ చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటుంది. 

ALSO READ | Preity Zinta: ఆ యువ క్రికెట‌ర్‌కు హాగ్ ఇచ్చిందంటూ ప్రచారం.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రీతి జింటా పోస్ట్

వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ.. " సెంచరీ తర్వాత చాలామంది నా దగ్గరకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ సక్సెస్ తర్వాత చుట్టూ జనం ఉండడం నాకు నచ్చలేదు. నాకు 500 కంటే ఎక్కువ మిస్డ్ కాల్స్ వచ్చాయి, కానీ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను, నా ఫ్యామిలీ, నాకున్న కొంతమంది ఫ్రెండ్స్ నాకు చాలు".  అని వైభవ్ బదులిచ్చాడు. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో 13 ఏళ్లు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ జాక్ పాట్ కొట్టాడు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‎తో వేలంలోకి వచ్చిన ఈ యువ క్రికెటర్‎ను రాజస్థాన్ రాయల్స్ కోటీ పది లక్షలకు దక్కించుకుంది.