
ఐపీఎల్ 2025లో బుధవారం (మే 21) కీలక మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ లో విజయం తప్పనిసరి. ముఖ్యంగా ఢిల్లీకి ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఓడిపోతే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది. ప్లే ఆఫ్స్ కు ఇప్పటికే మూడు జట్లు అర్హత సాధించాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెట్టాయి. నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య పోటీ నెలకొంది.
ALSO READ | IPL 2025: బీసీసీఐ కొత్త రూల్.. అర్ధరాత్రి 1:15 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు
ఈ మ్యాచ్ కు ముందు రెండు జట్లకు బ్యాడ్ న్యూస్. ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించనుంది. ముంబైలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్యూవెదర్ ప్రకారం, మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం 60% కంటే ఎక్కువ. ఆట ప్రారంభంలో ముంబైలో ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మ్యాచ్ సమయంలో తేమ 78% వరకు హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఆకాశం మేఘావృతమై చిరు జల్లులు పడే అవకాశం ఉన్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ మ్యాచ్ జరగడం ఇరు జట్లకు కీలకం.
ALSO READ | ఐపీఎల్ ఫైనల్ అహ్మదాబాద్‌లో..
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. అప్పుడు ముంబై 15 పాయింట్లు.. ఢిల్లీ 14 పాయింట్లతో తమ చివరి మ్యాచ్ ఆడతాయి. రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్ పంజాబ్ తోనే ఆడాల్సి ఉంది. ముంబై, ఢిల్లీ తమ చివరి లీగ్ మ్యాచ్ ల్లో ఓడిపోతే ముంబై 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ రెండు జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్ ల్లో పంజాబ్ పై విజయం సాధిస్తే 17 పాయింట్లతో ముంబై టాప్- 4 లోకి అడుగుపెడుతుంది. ఒక పాయింట్ ఎక్కువ ఉండడం ముంబైకి కలిసొచ్చే అంశం.
ప్రస్తుతం ముంబై 12 మ్యాచ్ ల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ముంబైకి మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. బుధవారం (మే 21) ఢిల్లీ క్యాపిటల్స్ తో.. మే 26 పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఈ సీజన్ లో 12 మ్యాచ్ ల్లో 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. బుధవారం (మే 21) ముంబైగా ఇండియన్స్ తో మే 24 న పంజాబ్ తో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
Rain gonna play spoil sport tonight 🙂
— Altamash Iqbal (@altamashi25) May 21, 2025
The game between Mumbai Indians and Delhi Capitals is going to be affected due to heavy rain tonight in Mumbai as per Accu Weather! pic.twitter.com/aR0hAcAvNQ