IPL 2025: బీసీసీఐ కొత్త రూల్.. అర్ధరాత్రి 1:15 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు

IPL 2025: బీసీసీఐ కొత్త రూల్.. అర్ధరాత్రి 1:15 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు

ఐపీఎల్ 2025 సీజన్ లో బీసీసీఐ కొత్త రూల్ ను ప్రవేశపెట్టింది. మ్యాచ్ లు రద్దు కాకూండా ఉండడానికి అదనపు సమయాన్ని కేటాయించింది. వర్షం వలన లేకపోతే ఇతర కారణాల ద్వారా మ్యాచ్ జరగడానికి ఆలస్యం అయిన సందర్భంలో అదనంగా 120 నిమిషాలు పొడిగించారు. అన్ని ఫ్రాంచైజీలకు పంపిన నోటిఫికేషన్‌లో, మ్యాచ్ ప్లేయింగ్ షరతులలోని క్లాజ్ 13.7.3 కు సవరణను బీసీసీఐ ధృవీకరించింది. దీని ప్రకారం మ్యాచ్ 1:30 నిమిషాల వరకు జరగడానికి అనుమతి ఉంటుందేమో చూస్తారు. 1:30 తర్వాత కూడా మ్యాచ్ జరగడానికి అవకాశం లేకపోతే అప్పుడు మ్యాచ్ ను రద్దు చేస్తారు.

మంగళవారం (మే 20) నుండి ఐపీఎల్ లోని మిగిలిన లీగ్ మ్యాచ్ లకు ఈ రూల్ ను చేర్చనున్నారు. గతంలో 60 నిమిషాల ఎక్స్ ట్రా టైం ఉండేది. కానీ ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు ముందు మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లు రద్దు కాకుండదనే ఉద్దేశ్యంతో మరో గంట పొడిగించడం జరిగింది. ఐపీఎల్ మ్యాచ్ పూర్తి అయ్యేసరికి 11:30 అవుతుంది. గతంలో వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలిగితే కట్ ఆఫ్ టైం 12:30 నిమిషాల వరకు చూసేవారు. అప్పటికీ మ్యాచ్ జరగడం సాధ్యం కాకపోతే రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా 12:30 వరకు జరిగింది.

ALSO READ | IPL 2025: పంజాబ్, గుజరాత్‌కు బంపర్ ఛాన్స్.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ వేదికలు ఇవే!

గతంలో ప్లే ఆఫ్స్ కు రెండు గంటల అదనపు సమయం ఉండే రూల్ యధావిధిగా కొనసాగుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సీజన్ లోని మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లు రాత్రి 1:30 నిమిషాలలోపు జరిగేందుకు అవకాశం లేకపోతే రద్దు చేయనున్నారు. మే 25న మధ్యాహ్నం జరిగే గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తప్ప మిగిలిన ఎనిమిది లీగ్ మ్యాచ్‌లు సాయంత్రం 8 గంటలకు జరగనున్నాయి. ఈ సీజన్ లో ఇప్పటి వరకు వర్షం కారణంగా మూడు మ్యాచ్‌లు రద్దు చేయబడ్డాయి. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓవర్లను కుదించారు. 

ఐపీఎల్ 2025లో మరో మ్యాచ్ రద్దు కాకుండా బీసీసీఐ జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం (మే 23) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ను బీసీసీఐ బెంగళూరు నుంచి లక్నోకి మార్చింది. బెంగళూరులోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వేదిక మార్చాల్సి వచ్చింది. "రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ బెంగళూరులో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంకు మార్చారు" అని బీసీసీఐ మంగళవారం తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.