
న్యూఢిల్లీ: ఐపీఎల్–18 ప్లే ఆఫ్స్ వేదికలను బీసీసీఐ మంగళవారం (May 20) ఖరారు చేసింది. అహ్మదాబాద్, ముల్లాన్‌పూర్‌లో నాలుగు నాకౌట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. క్వాలిఫయర్–1 (మే 29), ఎలిమినేటర్ (జూన్ 1) మ్యాచ్‌లు ముల్లాన్‌పూర్‌లో జరగనున్నాయి. జూన్ 1, 3న జరిగే క్వాలిఫయర్–2, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది.
ఇక వర్షాల కారణంగా ఈ నెల 23న బెంగళూరులో జరగాల్సిన రాయల్ చాలెంజర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ను లక్నోకు తరలించినట్లు బీసీసీఐ వెల్లడించింది. హైదరాబాద్‌తో మ్యాచ్ తర్వాత ఆర్సీబీ 27న లక్నోతోనే మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ మ్యాచ్‌ను కూడా అక్కడికే తరలించారు. ‘పాక్‌తో వివాదం కారణంగా షెడ్యూల్‌కు అంతరాయం కలిగింది.
దాంతో పాటు వర్షాలను దృష్టిలో పెట్టుకుని ప్లే ఆఫ్స్ వేదికల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల మాదిరిగానే లీగ్ దశలో మిగిలిన మ్యాచ్‌లకూ రెండు గంటలు అదనంగా కేటాయించాం’ అని బీసీసీఐ పేర్కొంది.