Preity Zinta: ఆ యువ క్రికెట‌ర్‌కు హాగ్ ఇచ్చిందంటూ ప్రచారం.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రీతి జింటా పోస్ట్

Preity Zinta: ఆ యువ క్రికెట‌ర్‌కు హాగ్ ఇచ్చిందంటూ ప్రచారం.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రీతి జింటా పోస్ట్

తాను యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని హగ్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో మార్చింగ్ చేసిందంటూ క్లారిటీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ, పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా (Preity Zinta). వాస్తవం తెలుసుకోకుండా.. అదే మార్ఫింగ్ ఫొటోని ఉపయోగిస్తూ ఓ వెబ్ సైట్ దానిపై వార్త రాయడంపై షాక్ అయ్యానని చ్చేప్పుకొచ్చింది.

ఈ మేరకు ప్రీతి జింటా X వేదికగా ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చింది. "ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో. త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. ఆఖ‌రికి న్యూస్ ఛానెల్స్ కూడా మార్ఫింగ్ చేసిన చిత్రాలను ఉపయోగించి వాటిని వార్తలుగా చూపిస్తున్నాయి. అది చూసి నేను ఆశ్చ‌ర్య‌పోయాను" అని Xలో  ఆమె రాసుకొచ్చింది.

ఐపీఎల్‌-2025లో ఆదివారం(మే 18న) రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రీతి వైభవ్ ను హగ్ చేసుకున్నారంటూ కొందరు నెట్టింట ఫొటో పోస్టు చేశారు. అదే విషయాన్ని ఓ గుజరాతీ వెబ్ సైట్ ప్రచురించగా నటి రియాక్ట్ అయ్యారు. 

మరోవైపు, పంజాబ్ కింగ్స్ సహ యజమాని అయిన ప్రీతి ప్రత్యర్థి జట్టు సభ్యుడు వైభవ్ అలా ఎందుకు ప్రవర్తి స్తారనే చర్చ జరిగినా టెక్నాలజీ 'మాయ' అని తేలిపో యింది. అదే మ్యాచ్... సంజాబ్ కింగ్స్ టీమ్ 11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్ లోకి అడుగుపెట్టింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Preity G Zinta (@realpz)