ఒట్టావా: కెనడాలోని ఆర్కిటిక్ సముద్రానికి ఆను కుని ఉన్న పశ్చిమ హడ్సన్ బే ప్రాంతంలో ధ్రువపు ఎలుగుబంట్ల సంఖ్య తగ్గుతోంది. అక్కడ ఆడ, పిల్ల ధ్రువపు ఎలుగుబంట్ల మరణాల రేటు ఏటా పెరుగుతూ వస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ శతాబ్ధం చివరినాటికి వాటి జాతి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదముంది. ఈ విషయం "పోలార్ బేర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్"గా పిలవబడే ప్రముఖ టూరిస్టు ప్లేస్ అయిన చర్చిల్ లో కొందరు రిసెర్చర్స్ జరిపిన పరిశోధనలో బయటపడింది.
ధ్రువపు ఎలుగుబంట్లను లెక్కించడానికి ఐదేళ్లకొకసారి ఈ రిసెర్చ్ చేస్తారు. పరిశోధకుల రిపోర్ట్ ప్రకారం..2016లో చర్చిల్ లోని వెస్ట్రన్ హడ్సన్ బేలో 842 ఉన్న ధ్రువపు ఎలుగుబంట్ల సంఖ్య..2021నాటికి 618కి తగ్గిపోయింది. యూఎస్ నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ ప్రకారం..1980 నుంచి ఇప్పటి వరకూ హడ్సన్ బేలో ధ్రువపు ఎలుగుబంట్ల సంఖ్య దాదాపు 50శాతం తగ్గింది.
సంఖ్య ఎందుకు తగ్గుతోంది..?
ధ్రువపు ఎలుగుబంట్లకు ఆర్కిటిక్ సముద్రపు మంచే జీవనాధారం. వాటికి అక్కడే ఆహారం దొరుకుతుంది. అవి బతకడానికి, రెస్ట్ తీసుకోవడానికి కూడా ఆర్కిటిక్ సముద్రమే ప్రధాన వన రు. కొన్నేళ్లుగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేసవిలో మంచు త్వరగా కరిగిపోతోంది. చలికాలంలో మంచు ఏర్పడటం ఆల స్యం అవుతుంది. దీంతో ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే ధ్రువపు ఎలుగుబంట్లకు ఆహారం దొరుకుతోంది. అందువల్ల ఎక్కువకాలం ఆకలితో అలమటించవలసి వస్తోంది.
యూకే ఆధారిత నివేదిక ప్రకారం, ఆహారం లేకపోవడం వల్ల ధ్రువపు ఎలుగుబంట్ల ఆరోగ్యం దెబ్బతింటోందని తేలింది. ఎక్కువ వయస్సున్న ఎలుగుబంట్ల సగటు బరువు క్రమంగా తగ్గుతుందని పేర్కొంది. 2020లో జరిగిన మరో పరిశోధన లో పెరుగుతున్న టెంపరేచర్స్ వల్ల మంచు కరగడంతో ఆహారం దొరక్క ఆడ ఎలుగుబంట్లు తక్కువ బరువుతో పిల్లలు కంటున్నాయని తేలింది.
ఆడ ఎలుగుబంట్లు తమ పిల్లలకు జన్మనివ్వడానికి, రక్షించడానికి ఏర్పాటు చేసుకునే గుహలు అధి క టెంపరేచర్స్ కారణంగా కూలిపోతున్నయని చెప్పింది. ధ్రువపు ఎలుగుబంట్లు సీల్స్ వంటి జంతువులను వేటాడకపోతే.. ఆర్కిటిక్ నక్కలు, పక్షులు చనిపోతాయి. దీంతో అక్కడి ఆహార చ క్రం మొత్తం దెబ్బతింటుంది. ఫలితంగా ఆర్కిటి క్ పర్యావరణ వ్యవస్థకు ప్రమాదముంది.
