Men Beauty : వార్ డ్రోబ్ నీట్ గా ఎలా ఉంచుకోవాలి

Men Beauty : వార్ డ్రోబ్ నీట్ గా ఎలా ఉంచుకోవాలి

వార్ డ్రోబ్ లో డ్రెస్ లని నీట్ గా, ఒక ఆర్డర్ వాలో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేకాదు తక్కువ డ్రెస్లు మాత్రమే ఉండేలా చూసుకుంటే మరీ మంచిది. ఎందుకంటే వార్ డ్రోబ్ నిండా డ్రెస్లు ఉంటే వాటిల్లో ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కాదు. దాంతో టైమ్ వేస్ట్ అవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి...

• వార్ డ్రోబ్ తెరిచి అందులో అనవసరంగా ఉన్న డ్రెస్లని తీసెయ్యాలి. ఈ మధ్య ఆ డ్రెస్ వేసుకున్నారా? కంఫర్ట్ ఉందా? లేదా? ఏ డ్రెస్ లు రెగ్యులర్ గా వేసుకుంటున్నారు? అనేవి గమనించాలి. అంతేకాదు చాన్నాళ్లుగా వేసుకోని డ్రెస్లు వార్డ్రోబ్లో ఉంటే వాటిని తీసెయ్యాలి.

• డ్రెస్లకి మ్యాచ్ అయ్యే యాక్సెసరీలని వార్డ్రోబ్ లో పెట్టాలి. దాంతో పార్టీ, ఫంక్షన్కి రెడీ అయ్యేముందు హడావిడి పడాల్సిన అవసరం ఉండదు.

• సీజన్ మారినప్పుడు వార్డ్రోబ్లో డ్రెస్లి మార్చాలి. ఆయా సీజన్లో లో ఎక్కువగా వేసుకునే డ్రెస్లు, ఇతర వస్తువులు ఉండేలా చూసుకోవాలి. పండుగలు, స్పెషల్ అకేషన్స్కి ముందు రోజే వార్డ్రోబ్ సర్దుకుంటే ఎప్పుడూ ఒకే రకం అవుట్ ఫిట్ వేసుకోకుండా జాగ్రత్తపడొచ్చు.