ఆడపిల్లలకు మగవాళ్లు పాఠాలు చెప్పొద్దు: కోఎడ్యుకేషన్‌పై తాలిబాన్ నిషేధం

ఆడపిల్లలకు మగవాళ్లు పాఠాలు చెప్పొద్దు: కోఎడ్యుకేషన్‌పై తాలిబాన్ నిషేధం

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో ఇకపై మగపిల్లలు, ఆడపిల్లలు కలిసి చదువుకోవడానికి లేదు. కో ఎడ్యుకేషన్‌పై బ్యాన్ విధిస్తున్నట్టు తాలిబాన్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు ఆడపిల్లలకు మగ టీచర్లు పాఠాలు కూడా చెప్పకూడదని హుకుం జారీ చేసింది.

అఫ్గాన్‌లో ఇకపై విద్యా సంస్థలన్నీ షరియా చట్టం ప్రకారమే నడవాలని తాలిబాన్ ఉన్నత విద్యా మంత్రి షేక్‌ అబ్దుల్ హక్కానీ ఆదేశించాడు. ఆడపిల్లలకు మగ టీచర్లు పాఠాలు చెప్పడానికి అనుమతించరాదని అన్నాడు. అయితే ఈ నిర్ణయం ద్వారా మహిళలను తాలిబాన్లు ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారంటూ అఫ్గాన్‌ జర్నలిస్ట్ బషీర్ అహ్మద్‌ గ్వాఖ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో సరిపడా మహిళా స్టాఫ్ట్‌ లేరని అన్నారు. మరోవైపు గత వారమే అఫ్గాన్‌లోని హెరాత్‌లో ప్రావిన్స్‌లో ఏ విద్యా సంస్థలోనూ ఆడ, మగ విద్యార్థులను కలిపి ఒకే క్లాసులో కూర్చోపెట్టకూడదని తాలిబాన్లు స్పష్టం చేశారు.