టెన్త్ లో 10 మార్కులొస్తే పాస్

టెన్త్ లో 10 మార్కులొస్తే పాస్

హైదరాబాద్, వెలుగు : మానసిక వికలాంగ విద్యార్థులు, ఆటిజంతో బాధపడే వారికి టెన్త్ లో 10 మార్కులు వచ్చినా పాసైనట్లే. అయితే ఇందుకు 50 శాతం అటెండెన్స్ ఉండాలి. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివే ప్రత్యేక అవసరాలున్న పిల్లలకూ వార్షిక, పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వం పాస్ మార్కులను తగ్గించింది. వారందరీ గ్రౌండ్​ ఫ్లోర్​లోనే ఎగ్జామ్స్ రాయించాలని ఆదేశించింది. 2022–23 అకాడమిక్ ఇయర్​ నుంచే ఇవి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

లెప్రసీ నయమైన వ్యక్తులు, కండరాల బలహీనత, యాసిడ్ దాడి బాధితులు, బ్లైండ్, తక్కువ కంటిచూపు, చెవిటి, సరిగా వినిపించని వారికి, మూగ తదితర వైకల్యమున్న స్పెషల్ కేటిగిరి స్టూడెంట్లకు టెన్త్​లో పాస్ మార్కులను 35 నుంచి 20కి తగ్గించారు. 3 లాంగ్వేజీల్లో ఒకటి మినహాయింపు ఇచ్చారు. ఈ కేటగిరి స్టూడెంట్లకు  పరీక్ష సమయం ప్రతి గంటకు అదనంగా 20 నిమిషాలు కేటాయించాలని ఆదేశించారు.