- సంకేతాలు ఇచ్చిన ఫైనాన్స్ మినిస్ట్రీ ఎంఈఆర్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జులై–సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2)లో ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ 7–7.5 శాతంగా నమోదవుతుందని ఫైనాన్స్ మినిస్ట్రీకి చెందిన మంత్లీ ఎకనామిక్ రివ్యూ (ఎంఈఆర్) సంకేతాలిచ్చింది. స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ జీడీపీ డేటాను శుక్రవారం (నవంబర్ 28న) విడుదల చేయనుంది. ‘‘వివిధ ఫైనాన్షియల్ ఏజెన్సీలు క్యూ2 లో ఇండియా జీడీపీ వృద్ధి రేటు 7 శాతం నుంచి 7.5 శాతం మధ్య ఉంటుందని అంచనా వేశాయి.
దీనిని బట్టి ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందనే విషయం తెలుస్తోంది. ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉంది. లోకల్‌గా వినియోగం బలంగా ఉండగా, ప్రభుత్వ పాలసీలు ఎకానమీకి సపోర్ట్‌గా నిలుస్తున్నాయి. గ్లోబల్‌గా అనిశ్చితులు కొనసాగుతున్నా, ఇండియా మంచి పొజిషన్‌లో ఉంది”అని ఎంఈఆర్ వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్ (క్యూ1)లో ఇండియా జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందింది.
క్యూ2లో 7శాతం వృద్ధి రేటు నమోదవుతుందని ఆర్‌బీఐ అంచనా వేయగా, ఎస్‌బీఐ రీసెర్చ్ మాత్రం 7.5 శాతం వరకు వృద్ధి చెందొచ్చని పేర్కొంది. రేటింగ్ ఏజన్సీలు కేర్ఎడ్జ్ 7.2శాతం, ఇక్రా 7 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేశాయి.
