బెంజ్​ సేల్స్​ పెరిగినయ్

బెంజ్​ సేల్స్​ పెరిగినయ్
  • మొదటి క్వార్టర్లో 26 శాతం అప్‌

న్యూఢిల్లీ: ఈ ఏడాది మొదటి క్వార్టర్‌‌లో మెర్సిడెజ్​ బెంజ్​ సేల్స్​ జోరందుకున్నాయి. జనవరి–మార్చి 2022 మధ్యలో అమ్మకాలు 26 శాతం పెరిగి 4,022 యూనిట్లకు చేరినట్లు మెర్సిడెజ్​ బెంజ్​ వెల్లడించింది. సెమి కండక్టర్ల కొరత కొనసాగినప్పటికీ, తమ ఎస్​యూవీలు, సెడాన్లు బాగానే అమ్ముడయ్యాయని పేర్కొంది. ఇదేటైములో రామెటీరియల్స్, లాజిస్టిక్స్​ ఖర్చులూ భారీగా పెరిగినట్లు కంపెనీ తెలిపింది. అంతకు ముందు ఏడాది (జనవరి–మార్చి 2021) క్వార్టర్‌‌లో 3,193 కార్లను మెర్సిడెజ్​ బెంజ్​ అమ్మింది. ఆర్డర్​ బుక్​ 4 వేల యూనిట్లకు చేరడంతో ఈ ఏడాది రాబోయే నెలల్లోనూ డిమాండ్​ మెరుగ్గానే ఉంటుందనే ధీమాను మెర్సిడెజ్​ బెంజ్​ వ్యక్తం చేస్తోంది. ఈ–క్లాస్​ లాంగ్​ వీల్​ బేస్​ సెడాన్​ అమ్మకాలే ఎక్కువగా జరిగాయని, ఎస్​యూవీలలో జీఎల్​సీ దూసుకెళ్తోందని కంపెనీ పేర్కొంది. అమ్మకాలలో ఆ తర్వాత ప్లేస్​లలో జీఎల్​ఏ, జీఎల్​ఈ ఎస్​యూవీలు నిలుస్తున్నట్లు వివరించింది. సూపర్​ లగ్జరీ కార్ల పోర్ట్​ఫోలియో మొదటి క్వార్టర్లో  35 శాతం గ్రోత్​ రికార్డు చేసినట్లు తెలిపింది.

లాంగ్​ టర్మ్​ రికవరీకి ఈ ఏడాది మొదటి క్వార్టర్​ అమ్మకాలు మంచి ఫౌండేషన్​గా నిలుస్తాయని మెర్సిడెజ్​ బెంజ్​ ఇండియా మేనేజింగ్​ డైరెక్టర్​ మార్టిన్​ ష్వెంక్​ చెప్పారు. సెమి కండక్టర్ల కొరత, గ్లోబల్​ సప్లయ్​ చెయిన్​లో ప్రోబ్లమ్స్​, ఉత్పత్తి ఖర్చుల పెరుగుదల వంటి నేపథ్యంలో తమ సేల్స్​ మెరుగుపడటం విశేషమని పేర్కొన్నారు. కంపెనీ హిస్టరీలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఆర్డర్లను సాధించగలిగినట్లు చెప్పారు. రాబోయే నెలల్లోనూ ఇదే ట్రెండ్​ కొనసాగుతుందనే ఆశాభావం  వ్యక్తం చేశారు. గ్లోబల్​ సప్లయ్​ చెయిన్​లో ప్రోబ్లమ్స్​ వల్లే కస్టమర్లకు తగిన టైములో డెలివరీలు ఇవ్వలేకపోతున్నట్లు  మార్టిన్​ ష్వెంక్​ చెప్పారు. వీలైనంత త్వరగా వెహికల్స్​ డెలివరీ ఇచ్చేందుకు కంపెనీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.