బీనా ఆంటీ అప్డేట్ ఇచ్చేసింది.. మీర్జాపూర్ పార్ట్3 వచ్చేస్తోంది

బీనా ఆంటీ అప్డేట్ ఇచ్చేసింది.. మీర్జాపూర్ పార్ట్3 వచ్చేస్తోంది

మీర్జాపూర్(Mirzapur).. ఈ వెబ్ సిరీస్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ పొలిటికల్ డ్రామా సిరీస్ కు దేశవ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఓటీటీలో ఈ సిరీస్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. ఇప్పటికీ రెండు సీజన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ వెబ్ సిరీస్.. తాజాగా మూడో సీజన్ కోసం సిద్ధమవుతోంది. 

ALSOREAD :ఒక్క టీ షర్ట్ ఖరీదు అన్ని వేలా?!.. లగ్జరీ లైఫ్ అంటే మహేష్ బాబుదే

తాజాగా మీర్జాపూర్ సీజన్ 3(Mirzapur season 3) కి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది ఈ సిరీస్ లో బీనా క్యారెక్టర్ లో కనిపించిన నటి రసిక దుగాల్(Rasika dhugal). రీసెంట్ ఆమె మీర్జాపూర్ పార్ట్ 3 కోసం డబ్బింగ్ చెప్పిన ఫోటోను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన మీర్జాపూర్ సిరీస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇప్పటికే ఈ సిరీస్ పార్ట్ 3కి సంబందించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సిరీస్.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని సమచారం. మరి మీర్జాపూర్ సీజన్ 3 ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.