మహేష్ బాబు వేసుకున్న టీ షర్ట్ రూ.90 వేలా..?!

మహేష్ బాబు వేసుకున్న టీ షర్ట్ రూ.90 వేలా..?!

ప్రస్తుతం ఇండియాలో ఉన్న మోస్ట్ పేయిడ్ యాక్టర్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) ఒకరు. ఆయన ఒక్కో సినిమాకు దాదాపు రూ.80 నుండి రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ గా తీసుకంటారు. ఇక ఆయన పర్సనల్ లైఫ్ గురించి చేప్పాలంటే.. మోస్ట్ లగ్జూరియస్ గా ఉంటుంది. ఆయన వాడే కార్లు, ఉండే ఇల్లు, వేసుకునే బట్టలు అన్ని కోట్లు విలువచేసేవే ఉంటాయి.

ఇక తాజాగా మరోసారి కాస్ట్లీ అవుట్ ఫీట్ వేసుకొని కనిపించారు మహేష్. ఇటీవల ఆయన హైదరాబాద్‌లోని ది వెస్టిన్ మైండ్‌స్పేస్ లో జరిగిన హీల్-ఎ-చైల్డ్ కాఫీ టేబుల్ బుక్ లాంచ్‌కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కు మహేష్ ట్రెండీ బ్రూనెల్లో క్యూసినెల్లి-ఎంబ్రాయిడరీ స్లోగన్ హూడీలో కనిపించారు. ఈ అవుట్ ఫిట్ లో మహేష్ చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపించారు. అంతేకాదు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. 

ALSOREAD :బీనా ఆంటీ అప్డేట్ ఇచ్చేసింది.. మీర్జాపూర్ పార్ట్3 వచ్చేస్తోంది

అయితే ఈ స్టైలీష్ హూడీ ఖరీదు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని ఖరీదు అక్షరాలా రూ.90 వేలు. ఇది తెలుసుకున్న నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు. ఒక్క టీ షర్ట్ ధర రూ.90 వేలా అంటూ అవాక్కవుతున్నారు. 

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో గుంటూరు కారం(Guntur kaaram) సినిమా చేస్తున్నారు. పూజ హెగ్డే(Pooja hegde), శ్రీలీల(Sreeleela) హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.