మెస్ చార్జీలు.. స్కాలర్ షిప్ లు పెంచాలి : ఆర్. కృష్ణయ్య డిమాండ్

మెస్ చార్జీలు.. స్కాలర్ షిప్ లు పెంచాలి :  ఆర్. కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 8 లక్షల మంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల స్కూళ్లు, కాలేజ్ ల హాస్టల్స్  లో చదువుతుండగా.. పెరిగిన ధరల ప్రకారం మెస్ చార్జీలు.. స్కాలర్ షిప్ లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నప్పుడు విద్యార్థులకు  ఎందుకు పెంచరని ప్రశ్నించారు. మెస్ చార్జీలు.. స్కాలర్ షిప్ లు పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లపల్లి అంజి, గుజ్జ సత్యం అధ్యక్షతన విద్యార్థులతో కలిసి ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో మహాధర్నా చేపట్టారు. ఇందులో పాల్గొన్న కృష్ణయ్య మద్దతు తెలిపి మాట్లాడారు. హాస్టల్ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ప్రభుత్వాలకు రాకపోవడం దుర్మార్గమన్నారు. హాస్టళ్లలో పరిస్థితులు మెరుగుపడాలంటే పోరాటమే మార్గమని సూచించారు.