హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ నుంచి అంటూ వచ్చే మెసేజ్‌‌‌‌‌‌‌‌‌లు ఫేకా? కాదా? ఎలా తెలుసుకోవాలి

 హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ నుంచి అంటూ వచ్చే మెసేజ్‌‌‌‌‌‌‌‌‌లు ఫేకా? కాదా?  ఎలా తెలుసుకోవాలి

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కేవైసీ అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేసుకోకపోతే మీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ అకౌంట్ బ్లాక్ అవుతుందని, అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేసుకోవడానికి  ఈ కింది లింక్‌‌‌‌‌‌‌‌ను క్లిక్ చేయాలంటూ ఫేక్ మెసేజ్‌‌‌‌‌‌‌‌‌లు రావడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ నుంచి అంటూ  వచ్చే మెసేజ్‌‌‌‌‌‌‌‌‌లు ఫేకా? కాదా?  ఎలా తెలుసుకోవాలో ఈ ప్రైవేట్ బ్యాంక్ చెబుతోంది.  హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ నుంచి మెసేజ్‌‌‌‌‌‌‌‌‌లు హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీబీకే  లేదా హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీబీఎన్ అనే ఐడీ నుంచి వస్తాయని ప్రకటించింది. బ్యాంక్‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చే మెసేజ్‌‌‌‌‌‌‌‌‌లలోని  లింక్‌‌‌‌‌‌‌‌  hdfcbk.io.  అని ఉంటుందని పేర్కొంది. గుర్తు తెలియని నెంబర్లకు, లింక్‌‌‌‌‌‌‌‌లకు స్పందించొద్దని,  సెన్సిటివ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌ను పంచుకోవద్దని కస్టమర్లను హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ హెచ్చరిస్తోంది.  

ఇవి గుర్తు పెట్టుకోండి..

ఫేక్ మెసేజ్‌‌‌‌‌‌‌‌‌ల గురించి చెప్పటడంతో పాటు, వాటిని ఎలా గుర్తించాలో తెలియజేస్తూ తమ కస్టమర్లకు హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ ఈ–మెయిల్స్ పంపింది.  ఫేక్ మెసేజ్‌‌‌‌‌‌‌‌‌ ఎలా ఉంటుందో చెబుతూ రిఫరెన్స్ ఫోటోలను పంపింది.  అలానే ఒరిజిన్ మెసేజ్‌‌‌‌‌‌‌‌‌లు ఎలా ఉంటాయో తెలియజేస్తూ వాటి ఫోటోలను కూడా షేర్ చేసింది. 

ఈ–మెయిల్‌‌‌‌‌‌‌‌లోని ముఖ్యమైన పాయింట్స్‌‌‌‌‌‌‌‌...

1) బ్యాంకింగ్ డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌ను అడుగుతూ 10‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంకెల నెంబర్ నుంచి వచ్చే ఎస్‌‌‌‌‌‌‌‌ఎంఎస్‌‌‌‌‌‌‌‌ లేదా వాట్సాప్‌‌‌‌‌‌‌‌ మెసేజ్‌‌‌‌‌‌‌‌‌లకు రెస్పాండ్ అవ్వొద్దు.
2) ఓటీపీ, సీవీవీ, ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాన్ కార్డ్ వంటి  ఇతర పర్సనల్ డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌ పంచుకోవాలని హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ ఎప్పుడూ కోరదు.
3) మెసేజ్‌‌‌‌‌‌‌‌‌లలో బ్యాంక్ గుర్తులను వెతకండి.
4) అనుమానాస్పదంగా అనిపించే ఎస్ఎంఎస్‌‌‌‌‌‌‌‌ లేదా ఈ–మెయిల్స్‌‌‌‌‌‌‌‌ను report.phishing@hdfcbank.com రిపోర్ట్ చేయండి.
5) అన్‌‌‌‌‌‌‌‌ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ జరిగితే 18002586161 నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాల్ చేయండి. లేదా సైబర్ క్రైమ్‌‌‌‌‌‌‌‌ హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్ నెంబర్ 1930 కి కాల్ చేయండి. లేదా cybercrime.gov.in వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌కు వెళ్లండి.