ఫిఫా వరల్డ్ కప్ లో ఆల్ టైమ్ ఫేవరేట్ స్టార్.. క్రిస్టియానో రొనాల్డో ఫ్లా షోతో డిసప్పాయింట్ చేశాడు. ఒక్క గోల్ కూడా చేయకపోవడంతో గెలవాల్సిన మ్యాచ్ డ్రాగాముగిసింది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒకవైపు మరో స్టార్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ తో ఇరగదీస్తుంటే.. రొనాల్డో గోల్ కొట్టేందుకు ఇబ్బంది పడటం క్లియర్ గా కనిపించింది. దీంతో స్టేడియంలో మెస్సీ మెస్సీ అంటూ రొనాల్డోకు వ్యతిరేకంగా ఫ్యాన్స్ చేసిన నినాదాలు.. ఈ సూపర్ స్టార్ కు కాస్త అవమానంలా మారాయనే చెప్పాలి.
బుధవారం హ్యూస్టన్‌లో జరిగిన గ్రూప్ కె ఓపెనింగ్ మ్యాచ్‌లో పోర్చుగల్, డీఆర్ కాంగోతో మ్యాచ్ 1-1 డ్రాగా ముగిసింది. పోర్చుగల్ కెప్టెన్ గోల్ చేయడంలో విఫలమవడమే కాకుండా, మ్యాచ్ తర్వాత అపోనెంట్ టీమ్ నుంచి తన ప్రత్యర్థి లియోనెల్ మెస్సీ పేరుతో నినాదాలు చేయడం షాకింగ్ కు గురిచేసింది.
టోర్నమెంట్‌లో ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన పోర్చుగల్.. డీ ఆర్ కాంగోను నిలువరించడంలో ఫెయిల్ అయ్యింది. జూ నీవ్స్ గోల్ సాధించడంతో స్టాటింగ్ లో ఆధిక్యం సాధించిన టీమ్.. చివర్లో ఢీలా పడింది. హాఫ్ ఆఫ్ ది మ్యాచ్ కు ముందు కాంగో ప్లేయర్ యోవాన్ విస్సా గోల్ సాధించి స్కోర్ సమం చేశాడు. దీంతో యూరోపియన్ దిగ్గజ టీమ్ అయిన పోర్చుగల్ పై డీఆర్ కాంగో పాయింట్ సాధించడం ఆ టీమ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ మ్యాచ్ లో రొనాల్డో గోల్ కు గోల్ సాధించడం చాలా కష్టంగా మారింది. మ్యాచ్ మొత్తం మీద కేవలం రెండు షాట్‌లను మాత్రమే టార్గెట్ చేయగలిగాడు. అంతేకాకుండా బాల్ ను 25 సార్లు మాత్రమే తాకగలిగాడు. బాల్ పై ఆధిపత్యం సాధించే పోర్చుగల్.. ఈ మ్యాచ్ లో మాత్రం చాన్స్ తీసుకోవడంలో విఫలమయింది . వరల్డ్ కప్ కు ముందు చిలీ, నైజీరియాలతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లలో కూడా గోల్ చేయడంలో విఫలమైన రొనాల్డో, యూరో 2024 నుంచి ఇప్పటి వరకు మెయిన్ టోర్నమెంట్‌లలో 10 మ్యాచ్‌లలో ఒక్క గోల్ కూడా చేయలేకపోవడం ఆందోళనకరమైన విషయం.
మ్యాచ్ తర్వాత తనను టార్గెట్ చేస్తున్న ఫ్యాన్స్ ను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు రొనాల్డో. ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ గ్రౌండ్ నుంచి వెళ్తుండగా.. డీఆర్ కాంగో ఫ్యాన్స్.. మెస్సీ, మెస్సీ అని నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విమర్శలను, నినాదాలను పట్టించుకోకుండా టన్నెల్ వైపు వెళ్తూ.. గ్రౌండ్ లోకి ఎంటరైన డీఆర్ కాంగో అభిమానిని ఆప్యాయంగా కౌగిలించుకోవడంపై ఆన్‌లైన్‌లో చాలా మంది మెచ్చుకున్నారు.
- ఓపెనింగ్ మ్యాచ్ లలో.. రొనాల్డో, మెస్సీకి ఎంత తేడా
డిఆర్ కాంగోతో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో గోల్స్ చేయడానికి ఇబ్బంది పడుతుండగా, మెస్సీ అర్జెంటీనా చేసిన ప్రదర్శనపై చర్చ జరుగుతోంది. ఎనిమిది సార్లు బ్యాలన్ డి ఓర్ విన్నర్ అయిన మెస్సీ అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్ తో అర్జెంటీనాను 3-0 తేడాతో గెలిపించాడు. మొత్తం 16 ప్రపంచ కప్ గోల్స్‌తో మిరోస్లావ్ క్లోస్ రికార్డును సమం చేశాడు.
