రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకమైన విజయం : కవిత

రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకమైన విజయం : కవిత

అండర్ 19 క్రికెట్ ఉమెన్స్ వరల్డ్ కప్లో భారత్ జట్టు ఘన విజయం సాధించిన క్రికెటర్లను ఎమ్మెల్సీ కవిత సన్మానించారు. తెలంగాణ ఆణిముత్యాలైన త్రిష, యశ శ్రీలు కనబర్చిన ఆటతీరుతో కప్ సాధించడం గర్వంగా ఉందని అన్నారు.హైదరాబాద్ లోని తన నివాసంలో ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ విజేతలైన క్రికెటర్లు త్రిష, యశశ్రీలను కవిత  సన్మానించారు. ఫైనల్ మ్యాచ్లో త్రిష చివరి దాకా నిలదొక్కుకుని జట్టు విజయానికి వెన్నెముకగా నిలిచిందని కవిత ప్రశంసించారు. ఈ  విజయం యువతకు స్ఫూర్తిదాయకమని, వీరు భవిషత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వీరి స్ఫూర్తితో  రాష్ట్రంలోని యువత కూడా క్రీడారంగంలో అద్భుతమైన  విజయాలు సాధించేందుకు నిరంతరం శ్రమించాలని సూచించారు. ఈ సందర్భంగా జట్టు ఫిట్నెస్ ట్రైనర్ శాలినిని కూడా కవిత ప్రత్యేకంగా అభినందించారు.