V6 News

8 వేల మంది మెటా ఉద్యోగులు ఔట్‌‌ !

8 వేల మంది మెటా ఉద్యోగులు ఔట్‌‌ !

టెక్ కంపెనీ మెటా ఈ ఏడాది మే 20 నుంచి  భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించనుంది. న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ప్రకారం.. కంపెనీ తన గ్లోబల్‌‌ వర్క్‌‌ఫోర్స్‌‌లో దాదాపు 20 శాతం అంటే సుమారు 16 వేల మందిని తీసేయాలని నిర్ణయించింది. ఈ ఉద్యోగుల కోతలో మొదటి రౌండ్‌‌ వచ్చే నెలలో జరగనుంది.  సుమారు 10 శాతం లేదా 8 వేల మందిని తొలగించనుంది.

న్యూఢిల్లీ: టెక్ కంపెనీ  మెటా ఈ ఏడాది మే 20 నుంచి  భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించనుంది. న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ప్రకారం, కంపెనీ తన గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దాదాపు 20శాతం అంటే సుమారు 16 వేల మందిని తీసేయాలని నిర్ణయించింది. ఈ ఉద్యోగుల కోతలో మొదటి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చే నెలలో జరగనుంది.  సుమారు 10 శాతం.. అంటే ఎనిమిది వేల మందిని తొలగించనుంది. రెండో రౌండ్ కోతలు ఈ ఏడాది చివరిలో ఉంటాయని అంచనా.

మెటా సీఈఓ మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జూకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏఐలో లక్షల కోట్ల రూపాయిలను పెట్టుబడి పెడుతుండడంతో  ఖర్చులు తగ్గించుకోవడానికి  కంపెనీ ఉద్యోగులను తీసేస్తోంది. మెటా స్మాల్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొంతమంది ఉద్యోగులను బదిలీ చేయనుంది. 2025 చివరికి ఈ కంపెనీలో 79 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.  ఈ ఏడాది జరిగే ఉద్యోగాల కోత 2022–23 రీస్ట్రక్చరింగ్  తర్వాత  అతిపెద్దది.  అప్పట్లో 21 వేల మందిని తీసేశారు.