బాలయ్యకు విలన్‌గా రాజశేఖర్? 'NBK112'లో ఊహించని ట్విస్ట్ ఇదేనా?

బాలయ్యకు విలన్‌గా రాజశేఖర్? 'NBK112'లో ఊహించని ట్విస్ట్ ఇదేనా?

నటసింహం నందమూరి బాలకృష్ణ  చిత్రం వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే. టాలీవుడ్ లో ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ మాస్ హీరోకు తనదైన స్టైల్ లో యాక్షన్ టచ్ ఇచ్చేందుకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ రెడీ అవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ' NBK112' పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓక్రేజ్ అప్డేట్ చక్కర్లు కొడుతోంది.

ఈ భారీ యాక్షన్ మూవీలో  యంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఒక పవర్ ఫుల్ విలన్  పాత్రలో కనించబోతున్నారని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.  ఇటీవలే 'బైకర్ ' మూవీతో రీఎంట్రీ ఇచ్చి డిఫరెంట్ లుక్ లో మెప్పించారు. అయితే ఆయన పాత్ర, ఎంట్రీపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒక వేళ ఇదే నిజమైతే బాలయ్య లాంటి మాస్ హీరోకు విలన్ గా రాజశేఖర్ కనిపిస్తే థియేటర్లలో పూనకాలు ఖాయం. ఇద్దరు సీరియర్ హీరోల ఢీ  ఏ రేంజ్ లో ఉంటుందోనన్న చర్చ అప్పుడే మొదలైంది..

ALSO READ :  ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా.. నిర్మాత నాగవంశీ ప్రకటన.. 

ఈ చిత్రంలో మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. బాలకృష్ణ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారన్న టాక్ వినిపిస్తోంది.  బాలయ్యకు సరికొత్త మేకోవర్ డిజైన్ చేస్తున్న  కొరటాల శివ.. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ఈ సినిమాను మాఫియా బ్యాక్ డ్రాప్ తో కూడిన ఇంటెన్స్  యాక్షన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ కథను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.  ఎస్ఎల్వీ సినిమాస్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ , మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.