రాష్ట్రానికి వాతావరణశాఖ అలర్ట్

రాష్ట్రానికి వాతావరణశాఖ అలర్ట్
  • కొనసాగుతున్న ఉపరితల ద్రోణి..  నైరుతి నుంచి గాలులు
  • ఈనెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం

హైదరాబాద్: ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు పడతాయని.. అయితే భారీ వర్షాలకు సంబంధించి ఎటువంటి హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో నైరుతి నుంచి గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నెల 19న ఉత్తర బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.