ఎనిమిది జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ

ఎనిమిది జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ

8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ
నల్గొండ జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల టెంపరేచర్‌‌ నమోదు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో వడ గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా 40 డిగ్రీల పైనే టెంపరేచర్లు నమోదవుతున్నాయని, రానున్న ఐదు రోజుల్లో ఇవి మరింత పెరిగే చాన్స్‌ ఉందని తెలిపింది. శుక్ర, శనివారాల్లో టెంపరేచర్లు 43 నుంచి 45 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. 

గురువారం నల్గొండ జిల్లాలో సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువగా, 43.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్‌‌‌‌లో 41.2, భద్రాచలం, రామగుండంలో 41, ఆదిలాబాద్‌‌లో 40.8, మహబూబ్‌‌నగర్‌‌‌‌లో 40.5, మెదక్‌‌లో 40.2, హైదరాబాద్‌‌లో 39.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని రాష్ట్ర వాతావరణ శాఖ అధికారి శ్రావణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.