హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో స్పీడ్ పెంచండి : ఎండీ సర్ఫరాజ్

హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో పనుల్లో స్పీడ్ పెంచండి : ఎండీ సర్ఫరాజ్
  • అధికారులకు మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఓల్డ్ సిటీలో మెట్రో పనుల వేగాన్ని పెంచాలని అధికారులను మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశించారు. మెట్రో విస్తరణలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి వివిధ డిపార్ట్ మెంట్లతో సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ లోని మెట్రో రైల్ భవన్ లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా అధికారులు ఫేజ్ –1 మెట్రో ప్రాజెక్టు గురించి వివరాలను, ఫేజ్ –2 లోని పార్ట్ –ఏ, పార్ట్ –బీ స్థితిగతులను ఎండీకి వివరించారు. మెట్రో ఎండీ సర్ఫరాజ్..సెకండ్ ఫేజ్ కోసం తీసుకుంటున్న చర్యలు, పురోగతిని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టారని,  అందులో భాగంగా మెట్రో ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయాలని, ఇందుకోసం అధికారులు శ్రద్ధగా పనిచేయాలని ఎండీ సూచించారు.