SRH vs RCB: ఉప్పల్‌లో ఆర్‌‌‌‌సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు

SRH vs RCB: ఉప్పల్‌లో ఆర్‌‌‌‌సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు

ఐపీఎల్ లో భాగంగా హైదరాబాద్ లో మరో మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 25 న సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఓ వైపు సన్ రైజర్స్, మరోవైపు ఆర్సీబీ కావడంతో ఈ మ్యాచ్ పై భారీ హైప్ నెలకొంది. రెండు జట్లలో స్టార్ ఆటగాళ్లుండడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ అందింది. 

ఐపీఎల్ మ్యాచ్ సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మ్యాచ్ ముగిసే సమయానికి 11:30 అవుతుంది. ఈ మ్యాచ్ సందర్బంగా స్టేడియం కు వచ్చే క్రికెట్ అభిమానులకు ఇబ్బందులు కలగకుండా మెట్రో సేవల టైమింగ్స్ పొడిగించారు. అర్ధరాత్రి 1:10 వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఉప్పల్ , ఉప్పల్ స్టేడియం , ఎంజీఆర్ ఐ స్టేషన్స్ లో మాత్రమే ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది. మిగతా స్టేషన్స్ లో ఎగ్జిట్ మాత్రమే ఇవ్వనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. 

ఈ సీజన్ లో సన్ రైజర్స్ సత్తా చాటుతుంది. ఆడిన 7 మ్యాచ్ ల్లో 5 విజయాలను సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. సొంతగడ్డపై ఉప్పల్ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఫామ్ లో లేని ఆర్సీబీపై సొంతగడ్డపై ఈ మ్యాచ్ లోనూ గెలిచి ప్లే ఆఫ్ కు మరింత చేరువ కావాలని భావిస్తుంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఆడిన 8 మ్యాచ్ ల్లో ఒకటే గెలిచి 7 మ్యాచ్ ల్లో ఓడిపోయింది.