
- ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీ హిల్స్ అంటేనే కాంగ్రెస్ కు కంచుకోట అని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 30 వేలకుపైగా భారీ మెజార్టీతో గెలుపొందుతారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి గురించి ఎవరైనా చిల్లర మాటలు మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. అబద్ధాలు మాట్లాడటంలో బీఆర్ఎస్నాయకులు బీజేపీ వాళ్లను మించిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇంకా పదేండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పారు.