హైదరాబాద్లో ఎంజీ సెలెక్ట్ షోరూం షురూ

హైదరాబాద్లో ఎంజీ సెలెక్ట్ షోరూం షురూ

హైదరాబాద్​, వెలుగు:  జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్​ ఇండియా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బంజారాహిల్స్​లో తమ నూతన ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియన్స్​ సెంటర్​ ఎంజీ సెలెక్ట్​ను ప్రారంభించింది. 'రీఇమాజినింగ్​ లగ్జరీ' ఫిలాసఫీ ఆధారంగా ఈ కేంద్రం అత్యాధునిక పర్సనలైజ్డ్​ సేవలను అందించనుంది. 

కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్​ పెమ్మసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంజీ సెలెక్ట్​ తాత్కాలిక అధిపతి మిలింద్​ షా మాట్లాడుతూ, ఎంజీ సైబర్​స్టర్​, ఎంజీ ఎం9 మోడళ్లకు హైదరాబాద్​లో అద్భుతమైన స్పందన లభించిందని తెలిపారు.

 సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్, ప్రెసిడెన్షియల్ లిమోసిన్ ఎం9లను ఇక్కడ ప్రదర్శిస్తున్నామని చెప్పారు. బుకింగ్స్​ను కూడా ప్రారంభించామని ప్రకటించారు.