అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ జాతికి చెందిన నలుగురు మహిళా కాంగ్రెస్ సభ్యుల పట్ల ట్రంప్ వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. ‘ఇది మా అమెరికా, మీ అమెరికా కాదు. మనందరి అమెరికా’ అని వ్యాఖ్యానించారు. అమెరికాలో ప్రతి ఒక్కరికీ చోటు ఉంటుందన్నారు. మనం ఇక్కడే పుట్టినా…ఇక్కడ నివసిస్తున్నా… ఇక్కడున్నవారంతా అమెరికన్లేనని అన్నారు. అమెరికాకు ఉన్న భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ గొప్పదనాన్ని చాటుతోందని తెలిపారు. అయితే, ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకుండా ట్విట్టర్ ద్వారా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
