క్రిస్టల్‌‌ క్లియర్‌‌‌‌ ఫొటోలు తీసే బుల్లి కెమెరా

క్రిస్టల్‌‌ క్లియర్‌‌‌‌ ఫొటోలు తీసే బుల్లి కెమెరా

ఏనుగు కళ్లు ఎంత చిన్నగా ఉన్నా గుండుసూది లాంటి చిన్న వస్తువుల్ని కూడా స్పష్టంగా చూస్తుంది. అలాగే చూసేందుకు ఉప్పు కణిక అంత చిన్నగా కనిపించే ఈ కెమెరా తీసే ఫొటోలు మాత్రం క్రిస్టల్​ క్లియర్​గా ఉంటాయి. ఎందుకంటే దీనిలో ఉండే లెన్స్‌ వెరీ పవర్‌‌ఫుల్‌. సాధారణంగా చిన్న చిన్న వస్తువులను ఫొటో తీస్తే కాస్త బ్లర్‌‌గా కనిపిస్తాయి. ఇప్పుడా సమస్య ఉండదు. ఈ కెమెరాతో పెద్ద వస్తువులనే కాదు, ఎంత బుల్లి వస్తువులనైనా కొంచెం కూడా బ్లర్‌‌ లేకుండా క్లారిటీగా ఫొటో తియ్యొచ్చు అంటున్నారు ప్రిన్స్​టన్​ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సైంటిస్టులు. ఎంతగా అంటే మన శరీరంలో కనిపించకుండా దాక్కునే సూక్ష్మ జీవుల్ని కూడా ఈ కేమ్‌తో ఫొటో తీయొచ్చు. ఇందుకోసం అతి చిన్న అంటే మైక్రాన్‌ పరిమాణం ఉండే వస్తువులను కూడా బంధించే పవర్‌‌ఫుల్‌ లెన్స్‌ను యూఎస్‌ సైంటిస్టులు రెడీ చేశారు. ఈ కెమెరా హాఫ్​ మిల్లీమీటర్​ మాత్రమే ఉంటుంది. గ్లాస్​ లాంటి మెటీరియల్​తో దీనిని తయారుచేశారు. దీని మెటాసర్ఫేస్​పై సిలిండ్రికల్​ ఆప్టికల్​ యాంటెనాలు ఉంటాయి. ​ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ ఆధారంగా పనిచేసే ఈ కెమెరా లైట్​ను ఇమేజ్​గా మారుస్తుంది. అంటే ఇసుక రేణువంత బుల్లి బుల్లి వస్తువులను కూడా ఈ కెమెరాతో ఫొటో తియ్యొచ్చన్నమాట. ఇది ఇప్పటి వరకూ ఉన్న మైక్రో-సైజ్ కెమెరా డిజైన్‌ల కంటే అడ్వాన్డ్స్‌ టెక్నాలజీతో రూపొందింది. ఆర్‌‌జీబీ కలర్స్‌ని క్యాప్చర్స్‌ చేసే మిలియన్ల మైక్రోస్ట్రక్చర్స్‌ని ఈ మెటాసర్​ఫేస్‌ కలిగి ఉంటుంది. అంటే ప్రతి కలర్‌‌ఫుల్‌ ఇమేజ్‌ ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఆప్టికల్‌ డిజైన్‌కు సంబంధించిన ఈ విధానం కొత్తది కానప్పటికీ, ఫ్రంట్‌ సర్ఫేస్‌ ఆప్టికల్‌ టెక్నాలజీ, వెనుక భాగంలో న్యూరల్‌ బేస్డ్‌ ప్రాసెసింగ్‌ను ఉపయోగించే మొదటి సిస్టమ్‌ ఇదని రీసెర్చర్స్‌ చెబుతున్నారు. అలాగే సూపర్​స్మాల్​ రోబోలు తమ పరిసరాలను గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా మనుషుల శరీరంలోకి దీనిని పంపి దెబ్బ తిన్న భాగాలను, గుండె, మెదడు, ఊపిరితిత్తులు, లివర్​ వంటి వాటి పనితీరును దగ్గర నుంచి తెలుసుకోవచ్చు. సాధారణంగా కెమెరాల్లో ఫిల్మ్‌ లేదా డిజిటల్‌ సెన్సర్​లో ఇన్‌కమింగ్‌ లైట్‌ కిరణాలను ఫోకస్‌ చేయడానికి ఒంపుతో ఉండే గాజు లేదా ప్లాస్టిక్‌ లెన్స్​ను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కనుగొన్న ఈ లెన్స్‌తో సింగిల్‌ హెచ్‌ఐవీ వైరస్‌ పరిమాణాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఈ అడ్వాన్డ్స్ టెక్నాలజీ లెన్స్‌ ఉపయోగంలోకి వస్తే ముఖ్యంగా డాక్టర్లకు ఎంతగానో ఉపయోగపడతాయని రీసెర్చర్స్‌ అంటున్నారు.