మైక్రోసాఫ్ట్ సర్వీసులు డౌన్... ఔట్ లుక్ సహా పలు సేవలు పనిచేయడం లేదు

మైక్రోసాఫ్ట్ సర్వీసులు డౌన్... ఔట్ లుక్ సహా పలు సేవలు పనిచేయడం లేదు

ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ ఔట్ లుక్ సేవలు మళ్లీ డౌన్ అయ్యాయి. మైక్రోసాఫ్ట్ 365 సర్వీసులకు అంతరాయం కలిగింది. ఈ మేరకు 15వేల మంది యూజర్లు మైక్రోసాఫ్ట్ కు చెందిన వర్డ్, ఎక్స్ ఎల్ తో పాటు..ఇతర సేవలు పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. 

భారత్ లో కూడా మైక్రోసాఫ్ట్ 365 సర్వీసులకు అంతరాయం కలిగినట్లు యూజర్లు ట్వీట్ చేశారు. డౌన్ డిటెక్టర్ వెల్లడించిన సమాచారం ప్రకారం..ఔట్ లుక్ పనిచేయడం లేదని 91 శాతం మంది , మైక్రో సాఫ్ట్ ఎక్సేంజ్ సేవలకు అంతరాయం కలిగిందని మరో 7 శాతం మంది, షేర్ పాయింట్ సరిగా పనిచేయడం లేదని మరో 2 శాతం మంది ఫిర్యాదు చేశారు. 

ఈ  ఫిర్యాదులపై మైక్రోసాఫ్ట్ స్పందించింది. మైక్రోసాఫ్ట్ టీమ్స్, షేర్ పాయింట్ ఆన్ లైన్, వన్ డ్రైవ్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు గుర్తించామని తెలిపింది. సమస్యకు గల కారణాలు గుర్తించే పనిలో ఉన్నట్లు ప్రకటించింది. అతి త్వరలోనే ఈ సేవలను పునరుద్దరిస్తామని పేర్కొంది. 

మైక్రో సాఫ్ట్ సేవలకు అంతరాయం కలగడం ఈ ఏడాదిలో ఇది రెండో సారి. 2023 జనవరిలో కూడా భారత్ తో పాటు..పలు దేశాల్లో ఔట్ లుక్, ఎంఎస్ టీమ్స్, ఆజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 వంటి సేవలు పనిచేయలేదు.