ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా

ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా
  •  పీఎస్ ఎదుట బీఆర్ఎస్ ఆందోళన

ఖమ్మం : ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్ నేత ఇంటూరి శేఖర్ ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిన్న అర్ధరాత్రి హైడ్రామా నడుమ అదుపులోకి తీసుకున్నారు. దీంతో   ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. నేలకొండపల్లి పీఎస్ కు  శేఖర్ ను తరలించారు. ఆయన అరెస్ట్​ను నిరసిస్తూ పీఎస్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది.  శేఖర్ ను ఎందుకు అరెస్టు చేశారో  కారణం చెప్పాలంటూ ఉన్నతాధికారులను  ఎమ్మెల్సీ, బీఆర్​ఎస్​జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ నిలదీశారు.

అక్రమ అరెస్టులను చట్టం ముందు ఎదుర్కొంటామని ఈ సందర్భంగా ఆయన అన్నారు.  రాజకీయ కక్షలో భాగంగానే శేఖర్‌ను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.జీళ్లచెర్వులోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారని కాంగ్రెస్‌ నాయకుల ఫిర్యాదుతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు భావిస్తున్నారు. శేఖర్‌ అరెస్టును ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలు ఖండించారు.