డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్ అరెస్ట్

డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్ అరెస్ట్

ఖమ్మం జిల్లా: కూసుమంచి మండలం జీళ్ళ చెరువులోని దేవస్థానం ఎండోమెంట్ భూముల విషయంలో అక్రమాలు చేటు చేసుకున్నాయి.  బిఆర్ఎస్ నాయకులు గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాంటి అనుమతులు లేకుండా అధికారులను బెదిరించి వెంకటేశ్వర స్వామి దేవాలయ భూముల్లో అక్రమంగా  మట్టి త్రవ్వకాలు చేపట్టారనే  ఫిర్యాదుతో ఎండోమెంట్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో BRS  నాయకుడు, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ అవినీతి తేలడంతో ఎండోమెంట్ అధికారులు నేలకొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటూరి శేఖర్ ను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

శేఖర్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 120B, 409, 420,447 Red with 34 , 3 and 4 pdppr సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  శేఖర్ అరెస్ట్ పై ఆందోళన చేయడానకి కొందరు పోలీస్ స్టేషన్ కు వచ్చారు.  తప్పు చేసిన వారిని సహకరిస్తే చర్యలు తప్పవని పోలిసులు వారిని హెచ్చరించారు.  ఓ కేసు విషయంలో అన్ని రకాల ఆధారాలతో కేసు నమోదు చేసే, అరెస్ట్ చేస్తామని పోలిసులు అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, పోలిస్ యాక్ట్ ని ఉల్లంఘించినా చర్యలు తప్పవని ఆందోళన చేయడానికి వచ్చిన వారిని పోలిసులు హెచ్చరించారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఇన్నారని పోలీసులు ఆరా తీస్తున్నారు.