వలస కూలీలను ఊర్లోకి రానివ్వలేదు.. చెట్ల కిందే క్వారంటైన్​

వలస కూలీలను ఊర్లోకి రానివ్వలేదు.. చెట్ల కిందే క్వారంటైన్​

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం దుడుగు తండాకు చెందిన 50 మంది కూలీలు ముంబయి నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో ఆరు రోజుల క్రితం వచ్చారు. వారిని తండావాసులు ఊర్లోకి రానివ్వకపోవడంతో చెట్లకింద, పొలాల దగ్గర గుడిసెలు వేసుకుని ఉంటున్నారు.

వలస కూలీలు సొంత గ్రామాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సడలింపులు ఇవ్వడంతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నవారు తరలి వస్తున్నారు. ఎన్నో కష్టాలు పడి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. వచ్చినవారిని క్వారంటైన్ లో ఉంచాల్సి ఉండగా గ్రామస్తులు ఊర్లోకి రానివ్వడం లేదు. దాంతో ఊరి బయట అందుబాటులో భవనాలు ఉంటే వాటిలో లేదంటే చెట్ల కింద వారిని ఉంచుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబుబ్ నగర్  జిల్లాలోని వలస కార్మికులు మహారాష్ట్రలో ఉండటంతో ఇక్కడివారికి టెన్షన్  మొదలైంది. ముంబై, పుణె తదితర ప్రాంతాల నుంచి కార్మికులు వస్తుండడంతో ఆయా గ్రామస్తులు భయపడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి దాదాపు 4,500 మంది, నారాయణపేట నుంచి దాదాపు 5,000 మంది వరకు వలస కార్మికులు ఇప్పటికే గ్రామాలకు చేరుకున్నారు.  వలస కార్మికులు వస్తున్న విషయం అధికారులు ముందే గుర్తించి వచ్చిన వారికి పరీక్షలు జరిపి హోం క్వారంటైన్ లో ఉంచి వారిపై నిఘా ఉంచుతున్నారు.

గ్రామస్తుల్లో టెన్షన్

మహబూబ్ నగర్ లో కేసులు మొదట్లో పెరిగినా తరువాత పాజిటివ్  కేసులు నమోదు కాలేదు. నారాయణపేటలో ఒక పాజిటివ్ కేసు వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేదు. నాగర్ కర్నూల్ లో రెండు కేసులు వచ్చినా తరువాత పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. గద్వాల్ లో కేసులు పెరిగినా ఇప్పుడు పూర్తిగా అదుపులోకి వస్తున్నది. వసపర్తి మొదటి నుంచి సేఫ్ జోన్ లో ఉంది. మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాలు క్రమంగా ఆరెంజ్ నుంచి గ్రీన్ జోన్ లోకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో వలస కార్మికులు వస్తుండటంతో అటు అధికారులు, ఇటు గ్రామస్తుల్లో టెన్షన్  మొదలైంది.

ఊర్లలోకి రానిస్తలేరు

వలస కూలీలకు అధికారులు పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్  ఉండమని చెప్పి వారిపై నిఘా ఉంచుతున్నారు. అయినా వలస కూలీలు బయటకు వస్తున్నది గమనించిన గ్రామస్తులు కొన్ని ప్రాంతాల్లో వారిని ఊర్లోకి రాకుండా అడ్డుపడుతున్నారు. ధన్వాడ మండలంలో ఇలానే అడ్డుకోవడంతో 50 మంది చెట్ల కింద ఉంటున్నారు. మరికల్ మండలం మందిపల్లి తండాకు చెందినవారు  వంద మంది వరకు ముంబయి నుంచి ఐదు రోజుల క్రితం ప్రైవేటు వెహికల్స్ లో వచ్చారు. వారిని ఊరి బయట స్కూల్ వరండాలో క్వారంటైన్ లో ఉంచారు. నిత్యావసర సరుకులు వారే తెచ్చుకుంటున్నారు. మొదలే అకాల వర్షాలు, ఈదురుగాలులు, మరోవైపు ఎండవేడితో వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

పోలీసులు గైడ్ లైన్స్ ఫాలో కావట్లే..