1,70,000 మంది వ‌ల‌స‌ కూలీల‌ను వారి రాష్ట్రాల‌కు త‌ర‌లించాం

1,70,000 మంది వ‌ల‌స‌ కూలీల‌ను వారి రాష్ట్రాల‌కు త‌ర‌లించాం

తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం మేరకు ప్రత్యేక రైళ్ల ద్వారా వలస కార్మికులు, కూలీలను వారి రాష్ట్రాలకు తరలిస్తున్నామ‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ తెలిపారు. శ‌నివారం నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వలస కూలీలను అధికారులు ప్రత్యేక రైలులో తరలించారు. మొత్తం ఇప్పటివరకు 1 ల‌క్ష 70 వేల మంది వలస కూలీలను 128 రైళ్ల ద్వారా ఆయా రాష్ట్రాలకు తరలించిన‌ట్టు సీఎస్ తెలిపారు.

రైళ్లలో వెళ్లే వలస కార్మికులు కూలీలు బొజనం, మంచి నీరు సదుపాయం కల్పించామ‌ని చెప్పారు సోమేష్ కుమార్. వ‌లస కార్మికులు, కూలీల నమోదు ప్రక్రియ దాదాపు పూర్తి అయినట్లేన‌న్నారు. ఇది వరకు వెళ్ళిన వారు కూడా మళ్లీ తెలంగాణ కు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారని, ఇది శుభపరిణామమ‌ని పేర్కొన్నారు.

వలస కూలీలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా తరలిస్తున్న‌ట్టు డీజీపీ మహేంద‌ర్ రెడ్డి తెలిపారు. శ‌నివారం ఒడిశా , రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన‌ వలస కూలీలను వారి గమ్య స్థానాలకు చేర్చామ‌ని, నాంపల్లి, సికింద్రాబాద్, ప్రధాన రైల్వే స్టేషన్ ద్వారా వారిని తరలించామ‌ని చెప్పారు.