టోక్యోను విడిచిపోతే..కుటుంబానికి 6.33 లక్షలు

టోక్యోను విడిచిపోతే..కుటుంబానికి 6.33 లక్షలు

టోక్యోను విడిచిపోతే..కుటుంబానికి 6.33 లక్షలు
రాజధానిలో జనాభాను తగ్గించేందుకు జపాన్ స్కీం 

టోక్యో : జపాన్ లోని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో పల్లెల్లో జనాభా తగ్గిపోతుండగా సిటీల్లో జనాభా స్పీడ్ గా పెరుగుతోంది. రాజధాని టోక్యో ఏకంగా 3.80 కోట్ల మంది జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనం ఉన్న మెట్రోపాలిటన్ సిటీగా మారింది. అందుకే టోక్యో నుంచి ఇతర ప్రాంతాలకు వలసపోయే కుటుంబాలకు 10 మిలియన్ల యెన్ ల ఆర్థిక సహాయం (రూ. 6.33 లక్షలు) అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి 2019 నుంచే ఈ స్కీం ఉండగా, వలస వెళ్లిపోయే ఒక్కో కుటుంబంలోని ఒక్కో బిడ్డకు 3 లక్షల యెన్ లు (రూ.1.90 లక్షలు) ఇస్తామని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. తాజాగా ఒక్కో బిడ్డకు ఆర్థిక సహాయాన్ని 10 లక్షల యెన్ లకు పెంచింది.

ఈ స్కీంతో 2027 నాటికి టోక్యో నుంచి 10 వేల కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతాయని సర్కారు అంచనా వేస్తోంది. అయితే, ఈ స్కీం కింద పైసలు తీసుకుని, తర్వాత ఎక్కడికో వెళ్తామంటే కుదరదని ప్రభుత్వం రూల్స్ పెట్టింది. ఈ స్కీంతో లబ్ధి పొందిన కుటుంబం ఏదైనా ఒక గ్రామీణ ప్రాంతంలో ఐదేండ్లు తప్పకుండా నివాసం ఉండాలని, ఆ కుటుంబంలో ఒకరు అదే ఊరిలో జాబ్ లేదా బిజినెస్ చేసుకోవాలని లేకపోతే తీసుకున్న డబ్బులు మొత్తం వాపస్ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.