కరోనా సోకిన చిన్నపిల్లల్లో మైల్డ్ సింప్టమ్స్

కరోనా సోకిన చిన్నపిల్లల్లో మైల్డ్ సింప్టమ్స్

వాషింగ్టన్: కరోనా సోకిన చిన్నపిల్లల్లో మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉన్నట్లు ఓ స్టడీలో తేలింది. వాళ్లలో జ్వరంతోపాటు స్వల్ప అనారోగ్యం మాత్రమే ఉంటుందని ఇండియన్ సంతతికి చెందిన సైంటిస్టుతోపాటు అమెరికా సైంటిస్టుల రీసెర్చ్ లో వెల్లడైంది. పిల్లల్లో కరోనా పాజిటివ్ గా తేలితే స్వల్పంగా ఊపిరి సంబంధిత లక్షణాలు ఉండవచ్చని లేదా ఉండకపోవచ్చని పిడియాట్రిక్స్ జర్నల్ లో పబ్లిష్ అయిన స్టడీ లో పేర్కొన్నారు. అప్పుడప్పుడు జ్వరం లక్షణం మాత్రమే ఉంటుందని సైంటిస్టులు చెప్పారు. ‘‘అమెరికాలో కరోనా సోకిన పసి పిల్లలకు సంబంధించి డేటా తక్కువగా ఉంది. వాళ్లలో స్వల్ప అనారోగ్యం ఉంటుందని, చైనాలో రిపోర్ట్ అయినట్లు హైరిస్క్ ఉండదు” అని స్టడీని లీడ్ చేసిన యూఎస్ లోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన లీనా మిథల్ చెప్పారు. చాలా మంది పిల్లల్లో జ్వరం కనిపించిందని, ఎలాంటి మెడికల్ హిస్టరీ లేని 18 మంది చిన్నపిల్లల్ని అసెస్ చేసినట్లు తెలిపారు. వీరిలో 50 శాతం మంది పిల్లలను హాస్పిటల్స్ లో అడ్మిట్ చేసినట్లు చెప్పారు. ఆక్సిజన్, రెస్పిరేటరీ సపోర్ట్, ఇంటెన్సివ్ కేర్ అవసరం రాలేదన్నారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన 9 మందిలో ఆరుగురికి డయేరియా, వాంతి, పూర్ ఫీడింగ్ లాంటి గ్యాస్ట్రో ఇంటెన్ స్టైనల్ సింప్టమ్స్ కనిపించినట్లు తెలిపారు.

గంగూలీ ఇంట్లో నలుగురికి కరోనా