ప్రతి పది సెకన్లకు ఒక మరణం.. దేనివల్లో తెలుసా?

ప్రతి పది సెకన్లకు ఒక మరణం.. దేనివల్లో తెలుసా?

అంటువ్యాధులు.. ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయని మనకు తెలుసు. సాధారణమైందే అనుకుని భావించే ఈ అంటువ్యాధుల వల్ల లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని మీకు తెలుసా.. తాజా అధ్యయనం ఒకటి ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది. లాన్సెట్​ పత్రికలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ప్రపంచంలో ఏటా 30 లక్షల మంది పిల్లలు, టీనేజర్లు, యువకులు అంటువ్యాధుల వల్ల మరణిస్తున్నారు. ప్రతి 10 సెకన్లకు ఒక మరణం సంభవిస్తోంది. ఇండియా, నైజీరియా, పాక్​లలో అంటువ్యాధి మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. 

అత్యధికాదాయం కలిగిన దేశాల్లో 6 శాతం డెత్​లు సంభవిస్తుండగా.. ఎక్కువగా అల్పాదాయ, మధ్యాదాయ  దేశాల్లోనే నమోదవుతున్నాయి. అంటువ్యాధుల్లో ముఖ్యంగా నీళ్ల విరేచనాలు, న్యుమోనియా, మలేరియా బాలల్లో ఎక్కువగా ఉంటుండగా.. యువతలో హెచ్​ఐవీ, క్షయ మరణాలకు దారి తీస్తున్నాయి.  2020లో కరోనా వైరస్​ వ్యాధి ప్రబలడంతో ఈ అంటువ్యాధులపై జరిపే రిసర్చ్​లను చాలా దేశాలు పెంచాయి.