ఎంఐఎంకు 7 స్థానాలే ఐనా .. ఇంపార్టెన్స్ తగ్గలేదే: పవన్ కళ్యాణ్

ఎంఐఎంకు 7 స్థానాలే ఐనా .. ఇంపార్టెన్స్ తగ్గలేదే: పవన్ కళ్యాణ్

జనసేన ప్రభుత్వాన్ని కచ్చితంగా  ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత  ధీమా వ్యక్తం చేశారు పవన్‌కల్యాణ్. మంగళగిరిలో కార్యకర్తల సమావేశంలో  ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడుతూ ఎంఐఎం  హైదరాబాద్లో ఏడు స్థానాలకే పరిమితమైనా.. ఆ పార్టీ ప్రాధాన్యత అలాగే ఉందన్నారు జనసేనాని.  జనాదరణ ఉన్నా 10 స్థానాలు కూడా రాకుంటే ఏం చేయలేం. కష్టాల్లో పవన్ గుర్తుకొస్తాడు.. ఎన్నికలప్పుడు మర్చిపోతారని నిర్వేదంగా మాట్లాడారు.   

గజమాలలు కాదు.. ఓట్లేయండి

డబ్బు లేకుండా రాజకీయాలు చేయవచ్చని చూపించాం మంటూ ఓట్లు కొనకుండా రాజకీయం చేయాలన్నారు జనసేనాని. అసలు డబ్బు ఖర్చు పెట్టకుండా రాజకీయాలు కుదరదు. మన బలం ఏమిటో మనం బేరీజు వేసుకోవాలి. క్రేన్లతో గజమాలలు వేయడం కాదు.. ఓట్లు వేయండి. పొత్తులను తక్కువగా అంచనా వేయవద్దని పవన్ వ్యాఖ్యానించారు.

10 స్థానాల్లో కూడా గెలవకుంటే ఏం చేస్తాం

2019 ఎన్నికల్లో 134 స్థానాల్లో పోటీ చేసినప్పుడు కనీసం 45నుంచి 50 స్థానాల్లో జనసేన ఎమ్మెల్యేలు ఉండి ఉంటే ముఖ్యమంత్రి పదవి వచ్చి ఉండేదని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. అప్పుడు ఓట్లు వేయకుండా ఇప్పుడు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.