
హైదరాబాద్ లో రోజు రోజుకు ర్యాష్ డ్రైవింగ్ లు పెరుగుతున్నాయి. అర్థరాత్రి ట్యాంక్ బండ్ పై మైనర్లు కారుతో బీభత్సం సృష్టించారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ట్యాంక్ బండ్ పై ఢీ వైడర్ ను ఢీ కొట్టారు.
అక్కడి నుంచి పబ్లిక్ వెంబడించడంతో మరోసారి ఐమాక్స్ థియేటర్ వైపు వెళ్తూ ఢివైడర్ ను ఢీ కొట్టారు. కారులో హెయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు సీజ్ చేసి మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు మైనర్లు ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున లంగర్ హౌస్ లో మండి తినడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.