తిరుబాటుదారులు రాజీనామాలు చేసి, ఎన్నికల్లో పోటీ చేయాలె

తిరుబాటుదారులు రాజీనామాలు చేసి, ఎన్నికల్లో పోటీ చేయాలె

తిరుగుబాటు ఎమ్మెల్యేలపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనయుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే విరుచుకుపడ్డారు. ముంబై నుంచి అస్సాం రాష్ట్రానికి పారిపోయిన షిండే వర్గం ఎమ్మెల్యేలు ఇక్కడే (మహారాష్ట్ర) ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి, చూపించాలన్నారు. షిండే వర్గం ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేసి, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. తాము ఏం తప్పు చేశామో చెప్పకుండా పారిపోయి ఇష్టం వచ్చినట్లు ఠాక్రే ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదన్నారు. 

మరోవైపు శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ కు ఈడీ అందించిన నోటీసులపైనా మంత్రి ఆదిత్య ఠాక్రే స్పందించారు. ‘ఇది రాజకీయం కాదు, ఇది ఇప్పుడు సర్కస్‌గా మారింది’ అంటూ కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో బలనిరూపణ సందర్భంగా మహా వికాస్ అఘాడీ (MVA) కూటమి గెలుస్తుందన్న నమ్మకంతో ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. శివసేన పార్టీకి ద్రోహం చేసిన వారు ఎప్పటికీ పై చేయి సాధించలేరని అన్నారు.