రాయికల్, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల్లో ఇప్పటికే నాలుగింటిని అమలు చేశామని, త్వరలో మరో రెండింటిని చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. రాయికల్పట్టణంలో రూ.7.20 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి శనివారం భూమిపూజ చేశారు.
మహిళా సంఘ సభ్యులకు రూ.11 లక్షల విలువైన వడ్డీ లేని రుణాల చెక్కు, ఐదుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. కలెక్టర్ సత్య ప్రసాద్, అడిషనల్కలెక్టర్ రాజా గౌడ్, ఆర్డీవో మధుసూదన్, కమిషనర్ నాగరాజు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజెంగి నందయ్య , మున్సిపల్ మాజీ చైర్మన్ హనుమాండ్లు పాల్గొన్నారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలి
రాయికల్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని జర్నలిస్టుల జేఏసీ అధ్యక్షుడు చింతకుంట సాయికుమార్ కోరారు. మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు జర్నలిస్టులతో కలిసి వినతిపత్రం అందించారు.
జగిత్యాలలో పరిణామాలపై అధిష్ఠానం ఆరా..
రాయికల్ పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి లక్ష్మణ్కుమార్ హాజరై మాట్లాడారు. జగిత్యాల పరిణామాలపై పార్టీ అధిష్ఠానం ఆరా తీస్తోందన్నారు. కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు మున్సిపల్‌ఎన్నికల్లో సీట్లు ఇచ్చే వైఖరితోనే ఉందని చెప్పారు. రాయికల్ మాదిగ కుంట అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నందయ్య, మాజీ జడ్పీటీసీ గోపి మాధవి, పట్టణ అధ్యక్షుడు రమేశ్, మహిళా అధ్యక్షురాలు మమత, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాలావత్ ప్రసాద్ తదితరులున్నారు.
