స్టూడెంట్లను క్లాస్ రూంలకే పరిమితం చేయొద్దు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

స్టూడెంట్లను క్లాస్ రూంలకే పరిమితం చేయొద్దు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
  • స్కిల్స్, పర్యావరణం, హెల్త్ పై అవగాహన పెంచాలి
  • అధికారులకు మంత్రి అడ్లూరి సూచన

హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లో చదవుతున్న పిల్లలను క్లాస్ రూములకే పరిమితం చేయెద్దని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్  అన్నారు. పర్యావరణం, స్కిల్స్  పెంచుకోవడం, వ్యక్తిగత శుభ్రత వంటి అంశాలపై అవగాహన పెంచాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఎంసీహెచ్ఆర్డీ ఇన్​స్టిట్యూట్​లో ఎస్సీ గురుకుల ప్రిన్సిపల్స్, జోనల్  ఆఫీసర్లకు రెండ్రోజుల పాటు జరిగిన ఒరియెంటేషన్  ట్రైనింగ్ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంపై మంత్రి ఓ ప్రకటనలో సందేశం ఇచ్చారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణ గురుకులాలు ఉండాలని, పిల్లలపై అధికారులు ఫోకస్ పెట్టాలన్నారు. ఏ సమస్య ఉన్నా, ఏ ఘటన జరిగినా ఉన్నతాధికారులకు చెప్పాలని ఆదేశించారు. 

రానున్న రోజుల్లో గురుకులాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ గురుకుల సెక్రటరీ  అలుగు వర్షిణి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పర్యావరణ స్ఫూర్తి నింపేందుకు రూపొందించిన ‘మిషన్ ప్రకృతి’ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. ఇందులో పోస్టర్, స్లోగన్  పోటీలు, ఆరోగ్యకరమైన స్థానిక ఆహార పదార్థాల ప్రాచుర్యం వంటి అంశాలు ఉంటాయని వెల్లడించారు.