 
                                    - ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కీమ్ ద్వారా అర్హులైన వారికి మాత్రమే నిధులు విడుదల చేస్తామని అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం సెక్రటేరియెట్ లో నిర్వహించిన ప్రెస్మీట్లో మంత్రి మాట్లాడారు.
తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసి వర్గాలకు చెందిన 3,642 మంది విద్యార్థులకు రూ.463 కోట్లు విడుదల చేశామని మంత్రి లక్ష్మణ్‌కుమార్ ప్రకటించారు. విదేశాలలో చదువుకుంటున్న ఒక్కో విద్యార్థికి ఓవర్సీస్ పథకం కింద రూ.20 లక్షలు అందచేశామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికి విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని నిధులు విడుదల చేశామన్నారు.

 
         
                     
                     
                    