రేపోమాపో అరెస్ట్.. జైల్లో సిక్స్ ప్యాక్ ట్రై చేసుకో కేటీఆర్ : మంత్రి అడ్లూరి

రేపోమాపో  అరెస్ట్.. జైల్లో  సిక్స్ ప్యాక్ ట్రై చేసుకో కేటీఆర్ : మంత్రి అడ్లూరి

డైవర్షన్ పాలిటిక్స్ చేసే కేటీఆర్ రేపో మాపో అరెస్ట్ అవుతారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్  కుమార్ అన్నారు.కేటీఆర్ జైలుకు పోయి జిమ్ చేసి సిక్స్ ప్యాక్  ట్రై చేయాలని సూచించారు.  జగిత్యాల జిల్లాలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. హరీష్ రావు, కేటీఆర్ చేసిన ఐదు లక్షల  కోట్ల భూ స్కాం ఆరోపణలపై స్పందించారు. రూ.5 లక్షల కోట్ల కుంభకోణం అని బావాబామ్మర్దులు వాళ్ల  సొంత మీడియాలో, సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తుస్తున్నారని ఫైర్ అయ్యారు.  

బీఆర్ఎస్ కు సోషల్ మీడియా యూనివర్సిటీ ఉందన్నారు అడ్లూరి.  ఐదు లక్షల కోట్ల కుంభకోణంపై వాస్తవాలు ఉంటే ముందుకు వచ్చి మాట్లాడాలని.. అబద్ధాలు మాట్లాడితే ఎవ్వరు ఊరుకోరన్నారు.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొల్లగొట్టిన బీఆర్ఎస్ నాయకులు  కనీసం ఉద్యోగులకు  ఒకటో తారీకు జీతాలు  ఇవ్వలేని పరిస్థితికి  తీసుకువచ్చారన్నారు.  

మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారని... బావాబామ్మర్దులకు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టాలని సూచించారు మంత్రి అడ్లూరి.  ప్రజలు మార్పు కోరుకుని ఇందిరమ్మ రాజ్యం రావాలని 2023 జనరల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని చెప్పారు . జూబ్లీల్స్ లో  విజయం తమదే అని గొప్పలు చెప్పిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి  చెప్పారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు మధ్యలోనే కాడి ఎత్తివేసిందన్నారు.  ఇటీవల జూబ్లీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు  వాళ్ళను చిత్తగా ఓడించారని అన్నారు. తమ ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు నాడు జీతాలు ఇచ్చి అన్ని సంక్షేమ పథకాలను విజయవంతంగా  అమలు చేస్తున్నామని తెలిపారు అడ్లూరి.