- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పెగడపల్లి, వెలుగు: ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో రూ.10 లక్షలతో నిర్మించిన కిచెన్ షెడ్డును, రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి పనుల్లో నాణ్యతపై ఎలాంటి రాజీ లేకుండా గుత్తేదారులతో పనులు చేయించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
ముఖ్యంగా సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. 2026– -27 విద్యా సంవత్సరం నాటికి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక కిచెన్ షెడ్‌ల నిర్మాణం పూర్తిచేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యా రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన బత్కేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మద్దెల సుధీర్‌ను, గుండెపోటుతో మృతిచెందిన సుంకే అంజయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, సర్పంచ్ అరుణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
