
వెలుగు, నెట్వర్క్: సర్వాయి పాపన్న గౌడ్ పోరాటాలు, త్యాగాలు వెనుకబడిన తరగతుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాయని, వారి పోరాట స్ఫూర్తితో భవిష్యత్ తరాలు ముందుకు సాగాలని మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. సోమవారం సంగారెడ్డి లోని కలెక్టరేట్ ఎదుట ప్రధాన రహదారిపై వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ ఎన్ఎంఆర్ క్యాంపు ఆఫీసులో కాంగ్రెస్నేత నీలం మధు పాపన్న గౌడ్ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. మెదక్జిల్లా కలెక్టర్ఆఫీసులో కలెక్టర్రాహుల్రాజ్, పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద అడిషనల్ కలెక్టర్నగేశ్, బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గడ్డం కాశీనాథ్, బీఆర్ఎస్ఆధ్వర్యంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్ పాపన్న విగ్రహాలు, ఫొటోలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీతా రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్ గౌడ్ పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొమురవెల్లిలో మోకు దెబ్బ జిల్లా అధ్యక్షుడు పచ్చిమట్ల స్వామి గౌడ్ మాట్లాడుతూ.. పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టడం హర్షనీయమన్నారు. చేర్యాల పట్టణంలో గౌడ సంఘం అధ్యక్షుడు సిద్ధిరాములు పాపన్న ప్లెక్సీకి పూలమాలవేసి నివాళులర్పించారు.