V6 News

రేపు (ఏప్రిల్  18) జాబ్ మేళా

రేపు (ఏప్రిల్  18) జాబ్ మేళా

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 18న శనివారం ఉదయం జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం (ఐటీఐ క్యాంపస్) ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ ఒక ప్రకటనలో తెలిపారు.

శ్రీ విజయ బయో ఫెర్టిలైజర్స్ సంస్థలో సుమారు 100 సేల్స్ రెప్రెసెంటేటివ్ పోస్టుల భర్తీకి ఈ మేళా జరుగుతోందని, 10వ తరగతి అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి, 18 ఏండ్లు నిండిన యువతీయువకులు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అర్హులని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం నిర్వాహకుడు మియాసాబ్ (9676047444) ను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.