అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశ పెట్టిన మంత్రి దామోదర

అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశ పెట్టిన మంత్రి దామోదర
  • అవయవ మార్పిడి బిల్లుప్రవేశపెట్టిన మంత్రి దామోదర..
  • మున్సిపల్, పంచాయతీ సవరణ బిల్లు ప్రతిపాదించిన మంత్రులు శ్రీధర్​బాబు, సీతక్క

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో సోమవారం మూడు బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టారు. తొలుత వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ట్రాన్స్​ప్లాన్​టెషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ 1997 (తోట) అడాప్షన్ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2011లో అవయవాల మార్పిడితో పాటు, కణజాలల మార్పిడిని  కూడా తోట యాక్ట్‌‌‌‌ అనుమతించిందని తెలిపారు. తోట యాక్ట్‌‌‌‌కు సంబంధించిన నిబంధనలను 2014లో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందని, 24 రాష్ట్రాల్లో తోట చట్టం అమల్లో ఉందని, దీంట్లో 2014లో  చేసిన నిబంధనలే ఉన్నాయన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తోట చట్టాన్ని, నిబంధనలను అడాప్ట్ చేసుకుంటుందని వివరించారు. దీని ద్వారా గుండె, కిడ్నీ, కాలేయం వంటి అవయవాలతో పాటు చర్మం, ఎముక మజ్జ, రక్త నాళాలు, హార్ట్ వాల్వుల మార్పిడి వంటివి కూడా చట్ట పరిధిలోకి రానున్నాయి. బ్రెయిన్ డెడ్ డోనర్ల నుంచి వీటిని సేకరించి, అవసరమైన వారికి మార్పిడి చేయడానికి వీలుపడుతుంది.

కొత్తగా ఆరు మున్సిపాలిటీలు..

తెలంగాణ మున్సిపాలిటీ అమైండ్ మెంట్ బిల్లు –2025ను మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులకు చైర్మన్, మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించడంతో పాటు ప్రైవేటు ఆస్తులను ఎన్నికల కోసం వినియోగించుకునే వెలుసుబాటు కల్పించున్నట్టు చెప్పారు. కొన్ని ప్రాంతాలను మున్సిపాలిటీల్లో చేర్చడం, కొన్ని మున్సిపాలిటీల నుంచి కొన్ని గ్రామాలను తొలగిస్తున్నట్టు తెలిపారు. కొత్తగా ఆరు మున్సిపాలిటీలను, కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

షెడ్యూల్​ 8 నుంచి79 గ్రామాల తొలగింపు

తెలంగాణ పంచాయ‌‌‌‌తీరాజ్ స‌‌‌‌వ‌‌‌‌ర‌‌‌‌ణ బిల్లు- 2025ను మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రతిపా దించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. రాష్ట్రంలోని 79 గ్రామ పంచాయ‌‌‌‌తీలు షెడ్యూల్ 8 నుంచి తొల‌‌‌‌గించి పుర‌‌‌‌పాలిక‌‌‌‌ ల‌‌‌‌లో విలీనం చేసేందుకు ప్రతిపాదించినట్టు చెప్పారు. సిద్దిపేట జిల్లాలో రెండు, ఆదిలాబాద్ జిల్లాలో ఒక‌‌‌‌ గ్రామ పంచాయతీ ఒక మండ‌‌‌‌లం నుంచి ఇంకో మండ‌‌‌‌లంలోకి మార్చేందుకు ప్రతిపాదన చేసినట్టు ప్రకటించారు. నాగ‌‌‌‌ర్ క‌‌‌‌ర్నూల్ జిల్లాలో రెండు జీపీలు, మున్సిపాలిటీ నుంచి తిరిగి గ్రామ పంచాయతీలుగా షెడ్యుల్ 8 లో చేర్చేందుకు ప్రతపాదనలు చేశారు. ఖ‌‌‌‌మ్మం, నాగ‌‌‌‌ర్ క‌‌‌‌ర్నూల్, వికారాబాద్ జిల్లాల‌‌‌‌లో కొన్ని గ్రామ‌‌‌‌పంచాయ‌‌‌‌తీల పేర్లు మార్చుతూ ప్రతిపాదనలు చేశారు.